Jharkhand : మైనింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ సమన్లు జారీ…రేపు విచారణకు ఆదేశం..!!

  • Written By:
  • Publish Date - November 2, 2022 / 09:29 AM IST

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు కష్టాలు తప్పేలా లేవు. మైనింగ్ కేసులో హేమంత్ సోరెన్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. గురువారం విచారణకు ఆదేశించింది. మైనింగ్ కేసులో నిందితుడు అయిన పంకజ్ మిశ్రా ఇంటిపై ఈడీ దాడి చేసిన సమయంలో బ్యాంక్ పాస్ బుక్ తోపాటు సీఎం హేమంత్ సోరెక్ కు సంబంధించిన చెక్ బుక్ ను స్వాధీనం చేసుకుంది. దీనిలో భాగంగానే ఈడీ గురువారం విచారణకు రావాలంటూ హేమంత్ సోరెన్ కు సమన్లు జారీ చేసింది.

జార్ఖండ్ లో జరిగిన మైనింగ్ అక్రమాల్లో మనీలాండరింగ్ పై ఈడీ విచారణ జరుపుతోంది. పంకజ్ మిశ్రాను పీఎంఎల్ఏ చట్టం కింద జూలై 19న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఈ కేసులో మిశ్రాతోపాటు బచ్చుయాదవ్, ప్రేమ్ ప్రకాశ్ లను కూడా నిందితులుగా చేర్చింది. వీరిద్దరినీ కూడా ఆగస్టు 5న అరెస్టు చేసింది. వీరు జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆగస్టు 24న ప్రేమ్ ప్రకాశ్ నివాసంపై ఈడీ దాడులు నిర్వహించింది. రెండు ఏకె 47 రైఫిల్స్ ను ఈడీ స్వాధీనం చేసుకుంది. పంకజ్ మిశ్రా , దాహు యాదవ్ , వారి సహచరులకు చెందిన 37 బ్యాంకు అకౌంట్లలో 11.88కోట్లను ఈడీ గతంలోనే జప్తు చేసింది.

సెప్టెంబర్ 16న కోర్టుల ఛార్జిషీట్ దాఖలు చేసింది ఈడీ. జార్ఖండ్ ముక్తి మోర్చా మాజీ కోశాధికారి రవి కేజ్రివాలో వాంగ్మూలాన్ని కూడా ఈడీ నమోదు చేసింది. అక్రమా మైనింగ్ ద్వారా వచ్చే డబ్బును నేరుగా ప్రేమ్ ప్రకాశ్ కు అందజేయాలని సీఎం పంకజ్ మిశ్రను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ జూలై 8న పంకజ్ మిశ్రా నివాసంలో జరిపిన సోదాల్లో సోరెన్ పాస్ బుక్ ను గుర్తించారు.