Site icon HashtagU Telugu

Jharkhand Floor Test: మీకు దమ్ముంటే రుజువు చేయండి: జార్ఖండ్ మాజీ సీఎం

Jharkhand Floor Test

Jharkhand Floor Test

Jharkhand Floor Test: హేమంత్ సోరెన్‌కు జరుగుతున్న అన్యాయాన్ని దేశం గమనిస్తోందని జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపై సోరెన్ అన్నారు. ఈ రోజు జార్ఖండ్ అసెంబ్లీని ఉద్దేశించి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రసంగించారు. నాపై ఎలాంటి అవినీతి లేదని తెలుసుకుని ఇప్పుడు నా కుటుంబంపై దాడి చేస్తున్నారని హేమంత్ సోరెన్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థలో చట్టవిరుద్ధమైన పనిని ఎలా నిర్వహించాలో బీజేపీ నుంచి నేర్చుకోవాలని కేంద్రంపై దాడికి దిగారు హేమంత్ సోరెన్.

ఎవరు ఆపడానికి ప్రయత్నించినా బీజేపీ అనుకున్నది చేసే తీరుతుంది. కానీ జార్ఖండ్ పౌరులు దీనిని మరచిపోరు. జార్ఖండ్ చరిత్ర వారిని ఎప్పటికీ క్షమించదని హెచ్చరించారు. నేను ఫ్లైట్ ఎక్కినా, కార్ ఎక్కినా, హోటల్స్ లో బస చేసినా వాళ్లకి ఇబ్బంది ఉండేది. నేను చేస్తే అది నేరం, వారు అదే చేస్తే అది నేరం కాదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దేశంలో ఎంత మంది ఆదివాసీలు పదవీకాలం పూర్తి చేశారో చెప్పండి, నన్ను కూడా ఇబ్బందులకు గురి చేస్తారని నాకు తెలుసనని ఉద్వేగానికి లోనయ్యారు.

ఆదివాసీలు, దళితులు ఉన్నత స్థానాలకు చేరుకోవడం తమకు ఇష్టం లేదని రాష్ట్ర అసెంబ్లీలో హేమంత్ సోరెన్ అన్నారు. మీకు దమ్ము ఉంటే నన్ను ఇరికించిన భూ కుంభకోణానికి రుజువు చూపించండని సవాల్ విసిరారు. ఈడీ, సీబీఐ, ఐటీలకు అధికారాన్ని తాకే అధికారం లేదని, అమాయకులను చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు.హేమంత్ సోరెన్‌కు ఎంత అన్యాయం జరుగుతుందో నేడు దేశం మొత్తం చూస్తోందని, ఏ గ్రామానికి వెళ్లినా ప్రతి ఇంట్లో హేమంత్ సోరెన్ పథకాలు కనిపిస్తాయని అన్నారు. దళితులు, ఆదివాసీలపై ఇంత ద్వేషం ఎందుకు కలుగుతుందో నాకు తెలియదని అసెంబ్లీలో హేమంత్ సోరెన్ కేంద్రంపై విరుచుకుపడ్డారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి చంపై సోరెన్ ప్రసంగిస్తూ.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన జార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నించిందని విశ్వాస పరీక్ష సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంపై సోరెన్ అన్నారు. కాగా 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంపై సోరెన్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

Also Read: Prabhas : ప్రభాస్ కూడా హ్యాండ్ ఇస్తే మాత్రం సమ్మర్ చప్పబడ్డట్టే.. కల్కి చేతిలోనే ఉంది అంతా..!

Exit mobile version