Hemant Soren : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోమవారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఒక ఫొటోను ‘ఎక్స్’లో సోరెన్ షేర్ చేస్తూ.. అది మర్యాదపూర్వక భేటీ అని రాసుకొచ్చారు. ప్రధానమంత్రి కార్యాలయం కూడా ‘ఎక్స్’ వేదికగా ఈ భేటీ వివరాలను తెలిపింది. ఆదివారం రోజు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కలిసి హేమంత్ సోరెన్(Hemant Soren) దంపతులు.. తాజాగా సోమవారం రోజు ప్రధాని మోడీని కలవడం గమనార్హం. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో మోడీతో హేమంత్ సోరెన్ భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్‌లో జరిగే ఛాన్స్ ఉంది.
We’re now on WhatsApp. Click to Join
రాంచీలోని ఓ ప్రభుత్వ భూమిని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సీఎం హోదాను అడ్డుపెట్టుకొని ఈ కబ్జాకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. ఈ భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోరెన్‌ను జనవరి 31న ఈడీ అరెస్టు చేసింది. ఈ అరెస్టు ఘటనకు రెండు రోజుల ముందే.. సీఎం పదవికి సోరెన్ రాజీనామా చేశారు. దాదాపు ఐదు నెలల పాటు జైలులో ఉన్న హేమంత్ సోరెన్‌కు జూన్ 28న జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలయ్యాక ఆయన మళ్లీ జార్ఖండ్ సీఎం (Jharkhand Chief Minister) పదవిని చేపట్టారు. ఈనేపథ్యంలో సోనియాగాంధీ, ప్రధాని మోడీలతో భేటీ కావడం గమనార్హం.
Also Read :Chandipura Virus : దేశంలో విస్తరిస్తున్న చండీపురా వైరస్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా నివారించాలి..?
నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ ఓలీ నియమితులు అయ్యారు. ఆయనతో రాష్ట్రపతి భవన్ ప్రధాన భవనం శీతల్ నివాస్‌లో నేపాల్ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడేల్ ప్రమాణ స్వీకారం చేయించారు. నేపాల్ ప్రధానమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన కేపీ శర్మ ఓలీని ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. బలమైన ద్వైపాక్షిక సంబంధాల కోసం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.