Jharkhand Elections : ఈసారి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్‌లతో కూడిన ఇండియా కూటమి పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈదఫా ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. గత ఎన్నికల ఫలితాన్నే రిపీట్ చేసి.. మరోసారి గద్దెను ఎక్కాలని ఇండియా కూటమి ఉవ్విళ్లూరుతోంది. ప్రజల బాగు కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలు అంటున్నాయి. సీఎం హేమంత్ సోరెన్ అక్రమ అరెస్టుతో తమకు ప్రజాబలం మరింత పెరిగిందని జేఎంఎం(Jharkhand Elections) వర్గాలు అంటున్నాయి.
Also Read :November 2024 : వృశ్చికరాశిలోకి శుక్రుడు.. నవంబరు 7 వరకు మూడురాశుల వారికి కష్టాలు !
బీజేపీ సీట్ల పంపకాలు
త్వరలోనే టికెట్ల కేటాయింపుపై తొలి జాబితాను విడుదల చేస్తామని బీజేపీ అంటోంది. తమతో పొత్తు కుదుర్చుకున్న ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌కు 10 సీట్లను ఇచ్చేందుకు కమలదళం రెడీ అయింది. మిత్రపక్షం జేడీయూకు 2 సీట్లను బీజేపీ ఇచ్చే ఛాన్స్ ఉంది. బంగ్లాదేశీల చొరబాటు, అవినీతి అంశాలే తమను ప్రజలకు చేరువ చేస్తాయని బీజేపీ బలంగా నమ్ముతోంది.
Also Read :IND vs NZ: నేటి నుంచి భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం
బీజేపీ బలాలు, బలహీనతలు
ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌తో పొత్తు బీజేపీకి కలిసొచ్చే అవకాశం. ఈ విద్యార్థి సంఘానికి 10 సీట్లను బీజేపీ కేటాయించే ఛాన్స్ ఉంది. తద్వారా జార్ఖండ్‌లోని విద్యార్థులు, యువత ఓట్లు తమకు పడతాయని కమలదళం విశ్వసిస్తోంది.జార్ఖండ్‌లో గిరిజనుల్లో మంచి పేరున్న చంపై సోరెన్ తమ పార్టీలో చేరిపోవడం కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. అంతేకాదు శిబూ సోరెన్ కోడలు సీతా సోరెన్ కూడా బీజేపీలో చేరారు. అది కూడా కమలదళానికి అడ్వాంటేజ్‌గా మారనుంది. ఇక బలహీనతల విషయానికొస్తే.. జార్ఖండ్‌లో రాజకీయ అనిశ్చితికి బీజేపీయే కారణమనే భావన కొన్ని వర్గాల ప్రజల్లో ఉంది. సీఎం హేమంత్ సోరెన్ అరెస్టును చాలామంది తప్పుపడుతున్నారు.సీఎం భార్య రాజకీయాల్లోకి వచ్చి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలవడం బీజేపీకి మైనస్ పాయింట్‌గా మారనుంది. మహిళా ఓటర్లలో చాలా మంది సానుభూతి జేఎంఎంకు కలిసి రావచ్చు. బీజేపీకి ప్రతికూలంగా పరిణమించవచ్చు. జార్ఖండ్‌లోని 81 సీట్లలో 28 ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. ఈ పరిణామం బీజేపీకి మైనస్. ఎందుకంటే గిరిజనులకు రిజర్వ్ చేసిన సీట్లలో జేఎంఎం స్ట్రాంగ్‌గా ఉంది.
Also Read :Wax Therapy : వాక్స్ కీళ్ల, కండరాల నొప్పిని నయం చేయగలదు, వాక్స్ థెరపీ అంటే ఏమిటో, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి..!
జేఎంఎం- కాంగ్రెస్ కూటమి బలాలు, బలహీనతలు
జేఎంఎం- కాంగ్రెస్ కూటమికి సీఎం హేమంత్ సోరెన్ అరెస్టు అంశం ప్లస్ పాయింటుగా మారనుంది. ఈ పరిణామంతో గిరిజన వర్గంలో చాలామంది జేఎంఎం కూటమి వైపే మొగ్గుచూపే అవకాశం లేకపోలేదు. జనాకర్షక సంక్షేమ పథకాల వల్ల జేఎంఎం- కాంగ్రెస్‌లపై ప్రజలకు మంచి అభిప్రాయం ఏర్పడింది. అది ఓట్ల రూపంలోకి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ‘సర్నా’ వర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తించాలని తీర్మానించి కేంద్రానికి జార్ఖండ్ సర్కారు లేఖ రాసింది. ఈ అంశం కూడా జేఎంఎం కూటమికి కలిసి రానుంది. ఇక బలహీనతల విషయానికొస్తే.. జేఎంఎం-కాంగ్రెస్ కూటమిలో కొన్ని అంతర్గత విభేదాలు ఉన్నాయి. సీట్ల కేటాయింపులో పొరపొచ్చాలు ఏర్పడే ఛాన్స్ ఉంది. జేఎంఎం నుంచి ముఖ్య నేతలు బీజేపీలోకి చేరడం మైనస్ పాయింటుగా మారొచ్చు. కాగా, నవంబరు 13, 20 తేదీల్లో రెండు విడతలుగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది.