Site icon HashtagU Telugu

JD Vance : భారత్‌కు చేరుకున్న జేడీ వాన్స్‌..సాయంత్రం ప్రధానితో భేటీ

JD Vance arrives in India, meets with Prime Minister in the evening

JD Vance arrives in India, meets with Prime Minister in the evening

JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌కు చేరుకున్నారు. ఆయన వెంట తన భార్య ఉషా చిలుకూరి వాన్స్‌ తమ ముగ్గురు పిల్లలు కూడా వచ్చారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. భారత సాంప్రదాయ నృత్యప్రదర్శన వారిని ఆకట్టుకుంది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలో దిగారు. ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీ తో ఆయన భేటీ కానున్నారు. వారి మధ్య వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలు చర్చకు రానున్నాయి. వారి రాకతో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను గణనీయంగా పెంచారు. ఇప్పటికే భద్రతా బలగాలు అన్ని ప్రాంతాల్లో మాక్ డ్రిల్లులు నిర్వహించాయి.

Read Also: LPG Distributors : దేశవ్యాప్త సమ్మెకు ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్స్ పిలుపు

జేడీవాన్స్ కుటుంబానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఢిల్లీ పోలీస్,ట్రాఫిక్ శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాయి. జేడీవాన్స్ ఉపాధ్యక్ష పదవిలో బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయనకు ఇది తొలి భారత పర్యటన. జేడీ వాన్స్ పర్యటన ప్రధానంగా వ్యక్తిగతంగానే ఉన్నప్పటికీ, భారత ప్రభుత్వం అధికారిక ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ అతి విశిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. సోమవారం సాయంత్రం 6:30గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జేడీ వాన్స్ కుటుంబానికి వ్యక్తిగత ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో మోడీ, జేడీ వాన్స్ దంపతులతో కలిసి ద్వైపాక్షిక సంబంధాలపైన, వాణిజ్య ఒప్పందాలపైన, రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపైనా చర్చించనున్నారు.

ఈ భేటీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్,జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ,అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా కూడా పాల్గొంటారు. కాగా, సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి జేడీ వాన్స్ కుటుంబం జైపూర్,ఆగ్రాకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఇక, నాలుగురోజులపాటు సాగనున్నఈ పర్యటనలో జేడీ వాన్స్ కుటుంబం ఢిల్లీతో పాటు మరికొన్ని ప్రధాన నగరాలను సందర్శించనున్నారు.

Read Also: Jharkhand Encounter : 8 మంది మావోలు మృతి