Site icon HashtagU Telugu

RLD – BJP : ‘ఇండియా’కు మరో షాక్.. బీజేపీతో చెయ్యి కలిపిన ఆ పార్టీ !

Rld Bjp

Rld Bjp

RLD – BJP : ప్రతిపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది.  దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్​ఎల్​డీ పార్టీ అధినేత జయంత్​ చౌదరీ ఇండియా కూటమిని వీడేందుకు రెడీ అయ్యారు. ఆయన బీజేపీతో చేతులు కలపాలని డిసైడ్ అయ్యారట. యూపీలో సమాజ్​వాదీ పార్టీ, కాంగ్రెస్​తో ఉన్న పొత్తు నుంచి బయటకు వచ్చేందుకు జయంత్​ చౌదరీ యోచిస్తున్నారు. ఇప్పటికే పొత్తులపై  ఆయన బీజేపీ(RLD – BJP) అగ్రనాయకత్వంతో చర్చలు కూడా జరిపారట. ఆర్​ఎల్​డీ నేతలు ఏడు లోక్​సభ స్థానాలను డిమాండ్​ చేయగా, బీజేపీ 5 సీట్లు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసిందట. దీనిపై ఆర్ఎల్‌డీ పార్టీ చీఫ్ జయంత్ చౌదరీ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు. యూపీలోని  కైరానా, మథుర, బాగ్​పత్​, అమరోహ్​ స్థానాలను ఆర్​ఎల్​డీకి ఇచ్చేందుకు బీజేపీ ఓకే చెప్పిందని తెలుస్తోంది.  దీనిపై ఆర్​ఎల్​డీ జాతీయ కార్యదర్శి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆర్​ఎల్​డీ, బీజేపీ పొత్తు ఫిక్స్ అయ్యింది. మాకు 4 నుంచి 5 స్థానాలు ఇచ్చేందుకు బీజేపీ ఓకే చెప్పింది.  మేం వాళ్లను 7 సీట్లు అడుగుతున్నాం. మా పార్టీ అధినేత జయంత్ చౌదరీ ప్రస్తుతం బీజేపీ అగ్రనాయకులతో చర్చిస్తున్నారు. ఈ చర్చలు త్వరలోనే పూర్తవుతాయి. ఈ లోక్​సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పని చేస్తాం’’ అని వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

2022 సంవత్సరంలో జరిగిన ఉత్తర​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్ ​దళ్​(ఆర్‌ఎల్‌డీ) , సమాజ్​ వాదీ పార్టీ కలిసి పోటీ చేశాయి. రాష్ట్రీయ లోక్​దళ్​ 33 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. 8 మంది ఆర్ఎల్‌డీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో మరో ఎమ్మెల్యే గెలవడంతో ఆ సంఖ్య 9కి పెరిగింది. ఆర్​ఎల్​డీ అధినేత జయంత్ చౌదరీ రాజ్యసభకు వెళ్లేందుకు సమాజ్‌వాదీ పార్టీ సహకరించింది. ఈ క్రమంలోనే లోక్​సభ ఎన్నికల్లోనూ ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్​ ​ ఇటీవల ప్రకటించారు. సమాజ్ వాదీ పార్టీని తాము 12స్థానాలను కోరామని.. ఏడు సీట్లు ఇచ్చేందుకు అఖిలేశ్ ఒప్పుకున్నారని అప్పట్లో ఆర్ఎల్‌డీ నేతలు చెప్పారు. అయితే ఈ ప్రకటన వెలువడిన కొన్ని రోజుల్లోనే ఆర్​ఎల్​డీ మాట మార్చడం గమనార్హం. బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తుండడం వల్ల ఆర్​ఎల్​డీ ఎన్​డీఏ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

Also Read : Tamil Hero Vishal New Party : హీరో విశాల్ కొత్త రాజకీయ పార్టీ?