Site icon HashtagU Telugu

Waqf Bill : వక్స్ బిల్లుకు జనసేన మద్దతు

Janasena Waqf Bill

Janasena Waqf Bill

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Bill)కు జనసేన పార్టీ (Janasena) మద్దతు ప్రకటించింది. నేడు లోక్సభలో చర్చకు రాబోయే ఈ బిల్లుపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ప్రేమ్ కుమార్ జైన్ కూడా తమ మద్దతును ప్రకటించారు. ఈ బిల్లులో తమ పార్టీ ప్రతిపాదించిన మూడు ముఖ్యమైన సవరణలు జరిగాయని, అందుకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. వక్ఫ్ బోర్డుల నిర్వహణ మరింత సమర్థంగా ఉండాలని టీడీపీ భావిస్తోందని తెలిపారు.

Birdflu : ఏపీలో బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి

ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం ఈ బిల్లుకు మద్దతు తెలుపుతూ అధికారికంగా ప్రకటించారు. జనసేన పార్టీ తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ముస్లిం సామాజిక వర్గం అభివృద్ధి, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, పారదర్శకత పెరగడానికి ఈ బిల్లు తోడ్పడుతుందని జనసేన అభిప్రాయపడింది. జనసేన నాయకత్వం ఈ సవరణ బిల్లులోని అంశాలను సమర్థించడంతో, ఎన్డీయే కూటమిలో పార్టీ బలపరిచిన విధానాన్ని స్పష్టంగా చూపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Nithyananda Assets : నిత్యానంద వేల కోట్ల ఆస్తులు ఆమెకేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) ముస్లిం సామాజిక వర్గానికి అనుకూలంగా ఉన్న నాయకుడని టీడీపీ ప్రతినిధులు పేర్కొన్నారు. వక్ఫ్ బిల్లుపై ఏ పార్టీ ఏ వైఖరి తీసుకుంటుందో అన్న అంశంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ప్రతిపక్ష పార్టీల నుంచి ఈ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ, జనసేన, టీడీపీ వంటి పార్టీలు మద్దతు ఇవ్వడం గమనార్హం. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే, వక్ఫ్ బోర్డుల నిర్వహణలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.