Site icon HashtagU Telugu

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు

1234

Resizeimagesize (1280 X 720) (6) 11zon

జమ్మూకశ్మీర్‌లో (Jammu and Kashmir) అనంతనాగ్ జిల్లాలోని ఓ మసీదు బయట ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రజలకు సురక్షిత ప్రదేశాలకు పంపిన అనంతరం జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి ఆ ప్రాంతమంతా కార్డెన్ సెర్చ్, సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఘటనలో ఒకరికి గాయమైందని, అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించామని తెలిపారు.

శుక్రవారం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అనంత్‌నాగ్‌లోని బిజ్‌బెహరాలోని హసన్‌పోరా తవేలా ప్రాంతంలోని మసీదు వెలుపల ఉగ్రవాదులు కాల్పులు జరిపారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు. ఇందులో ఒక వ్యక్తి గాయపడ్డాడు. గాయపడిన ఆసిఫ్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు.

Also Read: Meta layoffs 2023: మరోసారి ఉద్యోగులను తొలగించనున్న ఫేస్ బుక్..?

వారం రోజుల క్రితం శ్రీనగర్‌లోని బెమీనా ప్రాంతంలో ఓ ప్రభుత్వ ఉద్యోగిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బాధితుడు జమ్మూకశ్మీర్ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. బుల్లెట్లు లక్ష్యం తప్పిపోవడంతో దాడి నుండి బయటపడ్డాడు. TRF దాడికి బాధ్యత వహించిందని, ఆక్రమణలను తొలగించే ఆపరేషన్‌లో అధికారి పాల్గొన్నారని చెప్పారు. కమర్వారి ప్రాంతంలో కాల్పుల శబ్దం వినిపించిందని శ్రీనగర్ పోలీసులు ట్వీట్ చేశారు.

నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు పోలీసు బృందం అక్కడికి చేరుకుంది. ఎవరికీ హాని జరగలేదు, గాయపడలేదు. అనంతరం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఇది కాకుండా, ఫిబ్రవరి 16న తాంగ్‌ధర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి)పై చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ క్రమంలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.