కశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. టెర్రరిస్టులకు సహాయం చేస్తున్న ఓ స్థానిక వ్యక్తిని అరెస్ట్ చేసి, అతడి నుంచి 6 కిలోల ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (Kashmir IED)ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆదివారం పెను ప్రమాదం తప్పింది . ఇష్ఫాక్ అహ్మద్ వానీ అనే వ్యక్తిని అరెస్టు చేశామని.. అతడు పుల్వామాలోని అరిగ్రామ్ వాసి అని పోలీసులు వెల్లడించారు. మరోవైపు భద్రతా బలగాలు ఉత్తర కశ్మీర్ (Jammu and Kashmir)లో భద్రతను కట్టిదిట్టం చేశాయి. అదనపు భద్రతా సిబ్బందిని మోహరించడంతో పాటు నిఘా కోసం డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఈనెల 22 నుంచి 24 వరకు కశ్మీర్ లోని శ్రీనగర్ వేదికగా జరగనున్న జీ20 సమావేశాలను డిస్టర్బ్ చేసే లక్ష్యంతోనే ఉగ్ర మూకలు ఈవిధమైన కుట్రలు చేస్తున్నాయని సైనిక అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు గత ఐదురోజులుగా కశ్మీర్ (Jammu and Kashmir)లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ALSO READ : Lithium Reserves: జమ్మూ కశ్మీర్ లో భారీగా లిథియం నిల్వల గుర్తింపు