Site icon HashtagU Telugu

Jilebi Baba: బయటపడ్డ జిలేబీ బాబా రాసలీలలు.. ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారం..?

Fd0a8660be

Fd0a8660be

Jilebi Baba: సమాజంలో ఇటీవల దొంగ బాబాలు ఎక్కువైపోయారు. కీచక బాబాల ఆగడాలు బయటపడుతూనే ఉన్నాయి. బాబాల ముసుగులో మహిళలను లైంగికంగా వేధించడం, అత్యాచారాలకు పాల్పడటం లాంటివి బయటపడుతూనే ఉన్నాయి. ఎంతోమంది బాబులు కొత్తగా పుట్టుకొస్తున్నారు. స్వామీజీల ముసుగులో మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారు. ఇలాంటి బాబాల లీలలు అనేక ప్రాంతాల్లో బయటపడుతూనే ఉన్నాయి.

తాజాగా జిలేబీ బాబా ఆగడాలు బయటపడ్డాయి. బాబా ముసుగోలు ఏకంగా 120 మందికిపైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పంజాబ్ లోని మాన్సా ప్రాంతానికి చెందిన అమర్ వీర్ అనే వ్యక్తి బ్రతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి హర్యానాలోని తోహనాకు వచ్చాడు. అక్కడ జిలేబీ దుకాణం తెరిచాడు. కొద్దికాలానికి భార్య చనిపోవడంతో.. రెండేళ్లు అమర్ వీర్ మాయమయ్యాడు.

ఆ తర్వాత రెండేళ్లకు వచ్చిన అమర్ వీర్ జిలేబీ బాబాగా అవతారమెత్తాడు. తనకు మంతతంత్రాలు వచ్చని, సమస్యలన్ని తొలగిస్తానంటూ స్థానికులను నమ్మించాడు. తాంత్రిక పూజల పేరుతో ఎంతోమంది మహిళలను లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి సంబందించి వీడియోలను చిత్రీకరించి డబ్బు కావాలని మహిళలను వేధించేవాడు.

ఒక మహిళకు జిలేబీ బాబా లీలలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంలో అసలు విషయాలు వెలుుగలోకి వచ్చాయి. ఒక్క మహిళల పోలీసులను ఆశ్రయించడంతో.. ఆ ధైర్యంలో బాధిత మహిళలందరూ బయటకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేవారు. పోలీసులు బాబా ఆశ్రమంలో తనిఖీలు చేసి మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం హర్యానా కోర్టును జిలేబీ బాబాను దోషిగా తేల్చింది. జిలేబీ బాబా ఫోన్ లో మహిళల అత్యాచారాలకు సంబంధించి వీడియోలను గుర్తించారు. జిలేబీ బాబాను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తోన్నారు. జిలేబీ బాబా బాధితుల్లో ఇంకా చాలమంది మహిళలను ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.