Site icon HashtagU Telugu

Rahul Gandhi: రాహుల్ జోడో యాత్రపై జైన్ ముని వీడియో వైరల్

Rahul Gandhi

New Web Story Copy 2023 07 16t134559.022

Rahul Gandhi: జైన సన్యాసి రామ్నిక్ ముని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. రాహుల్ గాంధీ తన 4000 కిలోమీటర్ల ‘భారత్ జోడో యాత్ర’ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ తెలివైన వాడిగా అభివర్ణించాడు. రాహుల్ గాంధీ 4000 కిలోమీటర్లు నడిచిన విధానం చూసి ఆయనపై నా అభిప్రాయం మారిపోయిందని తెలిపారు. అంతకుముందు రాహుల్ సామాన్యుల పట్ల సీరియస్‌గా ఉండరని, వారి బాధను అర్థం చేసుకోరని నేను భావించేవాడినని, అయితే ఇప్పుడు రాహుల్ ఆంటే ఏంటో నాకు అర్ధం అయిందని చెప్పాడు రామ్నిక్ ముని. రాహుల్ భారతదేశాన్ని మారుస్తాడు. రాహుల్ ప్రతిష్టను దిగజార్చే కుట్ర జరుగుతుందని , అయితే సూర్యుడిని, సత్యాన్ని ఎవరు దాచగలిగారు అంటూ తన భావాన్ని వ్యక్తపరిచారు. అయితే ఈ సమయంలో జైన్ ముని రాహుల్ జోడోయాత్ర, ఆయన వ్యక్తిత్వంపై తన అభిప్రాయాన్ని వీడియో ద్వారా వ్యక్తపరచడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More: India-Mongolia: రేపటి నుండి భారత్, మంగోలియా మధ్య “నోమాడిక్ ఎలిఫెంట్-2023” సైనిక విన్యాసాలు.. బయలుదేరిన భారత బృందం..!