ఏప్రిల్‌లో జరిగిన జహంగీర్‌పురి హింసాకాండ నిందితుడు అన్సార్‌ని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆదివారం అదే ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించడంతో మళ్లీ అరెస్టు చేసినట్లు సమాచారం. ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఏప్రిల్ 16న హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య రాళ్లు రువ్వడం, కాల్పులు వంటి హింసాత్మక ఘర్షణలు జరిగాయి. హింసలో ఎనిమిది మంది పోలీసు సిబ్బంది, ఒక పౌరుడు గాయపడ్డారు. ఏప్రిల్ 17 ఆదివారం నాడు అన్సార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అన్సార్‌తో పాటు ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్… జకీర్ అనే వ్యక్తిపై కూడా చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆయన కూడా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జహంగీర్‌పురి వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అతడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. అన్సార్, జాకీర్ ఆ ప్రాంతంలో ఊరేగింపు ద్వారా ఉద్రిక్తత సృష్టించడానికి ప్రయత్నించారు. అన్సార్, జకీర్‌లతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అర్బాజ్, జునైల్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
Jahangirpuri Violence : జహంగీర్‌పురి హింసాకాండ నిందితుడు అన్సార్ మరోసారి అరెస్ట్

Arrest Imresizer