Site icon HashtagU Telugu

Padma Bhushan: ఇది గర్వించదగ్గ క్షణం: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు

భారత స్టార్‌ షట్లర్ పీవీ సింధు భారత అత్యున్నత పురస్కరాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డు అందుకుంది. 2020 సంవత్సరానికి ప్రకటించిన పద్మ పురస్కారాలను 2021, నవంబర్‌ 8న ప్రదానం చేశారు. 2020 ఏడాదికి మొత్తం 119మందిని పద్మ అవార్డులు వరించాయి. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్న పీవీ సింధు తనకి అవార్డు ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది.

సింధు 2016 రియోలో జ‌రిగిన ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ ప‌త‌కం గెల‌వ‌గా, ఈ ఏడాది టోక్యోలో జ‌రిగిన ఒలింపిక్స్ గేమ్స్‌లో బ్రాంజ్ మెడ‌ల్‌ ను సొంతం చేసుకుంది.

2015లో ప‌ద్మ‌శ్రీ అవార్డు ద‌క్కించుకున్మ సింధు ఈసారి పద్మభూషణ్ అవార్డు సొంతం చేసుకున్నారు. తనకి అవార్డు ఇచ్చిన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన సింధు తనపై మరింత బాధ్యత పెరిగిందని, ఈ ప్రోత్సాహంతో దేశానికి మరిన్ని పధకాలు తెచ్చిపెడుతానని తెలిపింది.

Exit mobile version