Site icon HashtagU Telugu

ITR Filing: జూలై 27 నాటికి 5 కోట్ల మంది ఐటీఆర్‌లు దాఖలు.. మరో 72 గంటలు మాత్రమే ఛాన్స్..!

Income Tax Refund

Income Tax Refund

ITR Filing: 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి మీరు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను ఫైల్ (ITR Filing) చేయకపోతే వెంటనే ITR ఫైల్ చేయండి. పన్ను చెల్లింపుదారులకు ఇప్పుడు ITR ఫైల్ చేయడానికి కేవలం మూడు రోజులు అంటే 72 గంటల సమయం మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ఐదు కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది.

పన్ను చెల్లింపుదారులు, పన్ను నిపుణులకు కృతజ్ఞతలు తెలుపుతూ గత ఏడాది కంటే మూడు రోజుల ముందుగానే 5 కోట్ల ఐటీఆర్‌ల మైలురాయిని సాధించామని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. జూలై 27, 2023 వరకు ఐదు కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయని పన్ను శాఖ తెలిపింది. గతేడాది జూలై 30 వరకు 5 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి.

Also Read: Go First Flights: జూలై 30 వరకు గో ఫస్ట్ విమానాలు రద్దు..!

ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. జూలై 27 వరకు దాఖలు చేసిన 5.03 కోట్ల ఐటీఆర్‌లలో 4.46 కోట్ల ఐటీఆర్‌లు ఈ-వెరిఫై చేయబడ్డాయి. ఇప్పటివరకు దాఖలు చేసిన అన్ని ఐటీఆర్‌లలో 88% ఐటీఆర్‌లు ఇ-వెరిఫై చేయబడ్డాయి. ధృవీకరించబడిన 4.46 కోట్ల ఐటీఆర్‌లలో 2.69 కోట్ల ఐటీఆర్‌లు ప్రాసెస్ చేయబడ్డాయి. ఆదాయపు పన్ను శాఖకు చెందిన హెల్ప్‌డెస్క్ పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ ఫిల్లింగ్, పన్ను చెల్లింపు, ఇతర సంబంధిత సేవల కోసం 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. కాల్‌లు, లైవ్ చాట్‌లు, వెబ్‌ఎక్స్ సెషన్‌లు, సోషల్ మీడియా ద్వారా పన్ను చెల్లింపుదారులకు సహాయం చేస్తున్నారు.

ఈ సౌకర్యాలు 31 జూలై 2023 వరకు అందుబాటులో ఉంటాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో కూడా పన్ను చెల్లింపుదారులకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి ఇంకా రిటర్న్‌ను దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులు చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి వెంటనే ITRని పూరించాలని ఆదాయపు పన్ను శాఖ విజ్ఞప్తి చేసింది.