ITBP Jobs : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)లో యువత ఉద్యోగ అవకాశం. 819 కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP Jobs) నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) గ్రూప్-సీ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టులలో 697 పురుషులకు, 122 మహిళలకు రిజర్వ్ అయ్యాయి. వీటిలో 458 పోస్టులను అన్ రిజర్వ్‌డ్ కేటగిరీ వారికి, 162 పోస్టులను ఓబీసీ కేటగిరీ వారికి, 81 పోస్టులను ఈడబ్ల్యూఎస్ కేటగిరి వారికి, 70 పోస్టులను ఎస్టీ వారికి, 48 పోస్టులను ఎస్సీ కేటగిరి వారికి రిజర్వ్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join
పదోతరగతి పాసై ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్ కోర్సులో క్వాలిఫై అయిన వారు అప్లై చేయడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబర్ 1లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించొచ్చు. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.100. మహిళలు, ఎక్స్-సర్వీస్మెన్, ఎస్టీ, ఎస్సీలకు అప్లికేషన్ ఫీజు లేదు.ఈ పోస్టులకు అప్లై చేసే పురుషుల ఎత్తు 165 సెం.మీ, మహిళల ఎత్తు 155 సెం.మీ ఉండాలి. పురుషుల ఛాతీ 75 సెం.మీ. నుంచి 80 సెం.మీ. మధ్య ఉండాలి.2024 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు వారు అప్లై చేయొచ్చు. ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికయ్యే వారికి రూ.21,700 – రూ.69,100 వరకు నెలవారీ పే స్కేల్ అమలవుతుంది.
Also Read :EPS Pensioners : గుడ్ న్యూస్.. ఇక ఏ బ్యాంకు నుంచైనా ఈపీఎస్ పెన్షన్
కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని సీఐఎస్‌ఎఫ్ పారిశ్రామిక యూనిట్లకు రక్షణ కల్పిస్తుంటుంది. ఈ యూనిట్లకు రక్షణ నిమిత్తం సీఐఎస్‌ఎఫ్ 1130 కానిస్టేబుల్/ ఫైర్ (మేల్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ (10+2)లో ఉత్తీర్ణులైన పురుషులు ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తి ఉన్న వాళ్లు సెప్టెంబర్ 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.