ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ (Ex Chhattisgarh Chief Minister Bhupesh Baghel) నివాసంలో ఆదాయపు పన్ను (IT) మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారుల సోదాలు హైడ్రామాకు దారితీశాయి. లిక్కర్ స్కామ్ కేసులో ఈ దాడులు నిర్వహించారని అధికారులు తెలిపారు. అయితే తనపై ఉన్న కేసును సుప్రీంకోర్టు కొట్టేసినా, ఇలాంటి దాడులు చేయడం అన్యాయమని భూపేశ్ బఘేల్ తీవ్రంగా మండిపడ్డారు. తన ఇంట్లో కేవలం రూ.33 లక్షలు మాత్రమే దొరికాయని, కానీ ED అధికారులు పెద్దఎత్తున క్యాష్ కౌంటింగ్ మెషీన్లను తెచ్చి, రాజకీయంగా తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
California almonds : కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా మరియు ప్రత్యేకంగా చేసుకోండి !
ఈ దాడుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపేశ్ బఘేల్ ఇంటి వద్ద జమైన INC కార్యకర్తలు, అధికారుల వాహనాలపై రాళ్లు రువ్వుతూ నిరసన తెలిపారు. ఈ హంగామాతో పోలీసులు భారీగా మోహరించారు. బఘేల్ తనపై జరుగుతున్న దాడులను రాజకీయం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. విపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యల కోణంలో ఈ దాడులను చూడాలని ఆయన వ్యాఖ్యానించారు.
YummyBee : హైదరాబాద్‌లో కార్యకలాపాలను విస్తరించిన యమ్మీబీ
ఈ ఘటనతో ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో పెనుదుమారం రేగింది. బిజెపి వర్గాలు మాత్రం, అక్రమ లావాదేవీలను వెలికితీసేందుకే ఈ దాడులు నిర్వహించారని చెబుతున్నాయి. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ఈ దాడులను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టంభన చర్యగా అభివర్ణించింది. భూపేశ్ బఘేల్ విషయంలో ఇంకా కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయా? లేదా ఈ దాడులు రాజకీయ కుతంత్రమేనా? అన్నదాని మీద రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.