Gautam Adani : అదానీ గ్రూప్ అధినేత, ప్రముఖ బిలియనీర్ గౌతం అదానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆ దేవుడు ఆదేశించాడు.. ఈ అదానీ పాటించాడు’’ అని సేవా కార్యక్రమాల విషయంలో తాను ఇటీవలే తీసుకున్న నిర్ణయాల గురించి ఆయన వెల్లడించారు. తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ‘ఇస్కాన్’ సంస్థ గవర్నింగ్ బాడీ కమిషన్ ఛైర్మన్ గురుప్రసాద్ స్వామి మహరాజ్‌తో గౌతం అదానీ భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఇద్దరూ సంభాషించుకున్నారు. ఈక్రమంలో గౌతం అదానీ కీలక వ్యాఖ్యలు చేశారు.
#WATCH | Ahmedabad, Gujarat: Adani Group Chairman, Gautam Adani met Guru Prasad Swami Maharaj, Chairman, Governing Body Commission of ISKCON today.
The Adani Group and ISKCON have joined hands to serve meals to devotees at the Maha Kumbh Mela in Prayagraj this year. The… pic.twitter.com/AdQmoplZ7a
— ANI (@ANI) January 9, 2025
నా యోగ్యత వల్ల ఇక్కడకు చేరుకోలేదని అనిపిస్తుంది
‘‘నేను చాలా సాధారణ కుటుంబానికి చెందినవాడిని. మనం ఏ స్థానానికి చేరుకున్నా వచ్చిన చోటును మర్చిపోకూడదు. కొన్నిసార్లు నేను కళ్ళు మూసుకున్నప్పుడు, నా సొంత యోగ్యత వల్ల నేను ఇక్కడకు చేరుకోలేదని అనిపిస్తుంది. నేనేం చేసినా.. దేవుడి ఆదేశం వల్లే చేస్తుంటాను. అందుకే నాకు డబ్బు, ఇతర వస్తువులు చాలా చిన్నగా అనిపిస్తుంటాయి’’ అని గౌతం అదానీ చెప్పుకొచ్చారు. ‘‘సమాజానికి సేవ చేసే విషయంలో అదానీ గ్రూప్ ఎన్నడూ వెనుకాడదు. ఈ అంశంలో మేం ఇస్కాన్ సాయం తీసుకుంటాం. ఇది మాకు చాలా ప్రతిష్ఠాత్మకమైన అంశం. మిలియన్ల మంది ప్రజలకు సేవ చేయగల అద్భుతమైన డెలివరీ వ్యవస్థ ఇస్కాన్‌కు ఉంది’’ అని గౌతం అదానీ(Gautam Adani) కొనియాడారు.
Also Read :Nuclear Engineers Kidnapped : 16 మంది న్యూక్లియర్ ఇంజినీర్లు కిడ్నాప్.. పాక్‌లో కలకలం
గీతా ప్రెస్, అదానీ గ్రూప్ కలిసి..
గౌతమ్ అదానీ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. “మహా కుంభమేళా అనేది భారతీయ సంస్కృతి, మత విశ్వాసం యొక్క గొప్ప యాగం! ఈ మహాయజ్ఞంలో ప్రతిష్ఠాత్మకమైన సంస్థ గీతా ప్రెస్ సహకారంతో మేళాకు వచ్చే భక్తులకు కోటి ‘ఆరతి సేకరణ’ కాపీలను ఉచితంగా పంపిణీ చేయనున్నాం. ఇది మాకు ఎనలేని సంతృప్తిని కలిగించే విషయం’’ అని అదానీ వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌లో రేపటి (సోమవారం) నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాలో భక్తులకు భోజన ఏర్పాట్లు చేసేందుకు ఇస్కాన్ సంస్థతో అదానీ గ్రూప్ చేతులు కలిపింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభమేళా జరగనుంది.