కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం (Karnataka government) ఫై ఐటీ ఉద్యోగులు ఆగ్రహం ( IT/ ITES Employees Union) వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో..ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఐటీ విషయంలో సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ఫై ప్రజలు మండిపడుతున్నారు. ఎక్కడైనా ఐటీ ని డెవలప్ చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని..నిరుద్యోగులకు ఉద్యోగులు వస్తాయని..అంతే కాకుండా అక్కడి ప్రాంతంకు ఎంతో డిమాండ్ పెరుగుతుందని అంత భావిస్తుంటారు. కానీ కర్ణాటక సర్కార్ మాత్రం ఐటీ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు..అక్కడ ఐటీ పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లేలా చేస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
మొన్నటికి మొన్న ఐటీ పరిశ్రమల్లోనూ స్థానికులకే ఉద్యోగాలివ్వాలని చట్టం తెచ్చేందుకు నిర్ణయించడం తో పలు సంస్థలు బయటకు వెళ్లేందుకు సిద్ధం అయ్యాయి. ఈ మేరకు ప్రకటనలు కూడా చేసాయి. దీంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఇక ఇప్పుడు ఐటీ ఉద్యోగుల విషయంలో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఐటీ ఉద్యోగులు రోజుకు పధ్నాలుగు గంటలు (IT sector working time to 14 hrs per day) పని చేయాలని చట్టం తెచ్చేందుకు సిద్ధమైంది. ఉద్యోగులతో రోజుకు 14 గంటలు పని చేయించుకునేలా చట్టాన్ని మార్చాలని కంపెనీలు కోరాయని దానికి ప్రభుత్వం అంగీకరించిందని బిల్లు తెచ్చేందుకు నిర్ణయించిందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. దీంతో ఒక్క సారిగా ఐటీ ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ప్రస్తుతం రోజుకు పది గంటల పని టైం… రెండు గంటల ఓవర్ టైం వర్కింగ్ అవర్స్ ఉన్నాయని.. దీన్ని మరో రెండు గంటలు పెంచుతున్నామని ప్రభుత్వం చెపుతుంది.
ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు, ఉద్యోగులు మండిపడుతున్నాయి. ఇప్పటికీ ఐటీ రంగంలో టార్గెట్ల పేరుతో.. అసలు సమయం కన్నా ఎక్కువే చేయించుకుంటున్నారని.. తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి . ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటూ ఉండటంతో.. ఐటీ ఉద్యోగులు కూడా వేరే నగరాలకు వెళ్లిపోవడం మంచిదన్న నిర్ణయానికి వస్తారని వాపోతున్నారు. మరి ఈ విషయంలో కర్ణాటక సర్కార్ మరోసారి ఆలోచిస్తుందో చూడాలి.
Read Also : Bhadrachalam : భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
