Chandrayaan-3: నిర్దేశిత కక్ష్యలోకి చంద్రయాన్-3.. చంద్రుని దిశగా ప్రయాణం!

దేశం మొత్తం చంద్రయాన్ 3 వైపు ఆసక్తి ఎదురుచూసింది. అందరూ అనుకున్నట్టే సక్సెస్ అయ్యింది.

  • Written By:
  • Updated On - July 14, 2023 / 04:36 PM IST

జాబిల్లిపై అన్వేషణ కోసం ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ ప్రయోగం ఫలించింది. ముందుగా అనుకున్న సమయం ప్రకారం.. చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మేరకు చంద్రయాన్-3ని ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ కక్ష్యలో వదిలినట్లు ఇస్రో తెలిపింది. రాకెట్ లాంచింగ్ ప్రారంభమైన 40 నిమిషాలకు ఇస్రో తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. చంద్రుని దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు.

సరిగ్గా మధ్యాహ్నం 2.35 గంటలకు కౌంట్‭డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే, వచ్చే నెలలో చంద్రయాన్ -3 జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద దిగితే ఆ ఘనత సాధించిన తొలి దేశంగా, చంద్రుడిపై సాప్ట్ ల్యాండింగ్‌ను సాధించిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందనుంది. 40 రోజుల ప్రయాణం అనంతరం ఈ చంద్రయాన్-3 లోని ల్యాండర్ జాబిల్లిపై దిగనుందని తెలిపారు.

Chandrayaan3 నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించడంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా స్పందించారు.చంద్రయాన్‌-3 భారతదేశ అంతరిక్షయానంలో కొత్త శకానికి నాంది పలికిందని తెలిపారు. భారతీయుల కలల్ని సాకారం చేసిందని పేర్కొన్నారు. ఈ విజయం మన శాస్త్రవేత్తల నిరంత కృషికి, అంకిత భావానికి నిదర్శనమని, వారికి సెల్యూట్‌ అని తెలిపారు.

Also Read: Ram Charan’s Daughter: క్లీంకార కోసం స్పెషల్ రూమ్, వీడియో షేర్ చేసిన ఉపాసన