Site icon HashtagU Telugu

ISRO Vigyani : విద్యార్థులకు ‘ఇస్రో విజ్ఞాని’గా మారే ఛాన్స్.. అప్లై చేయండి

Isro Vigyani

Isro Vigyani

ISRO Vigyani : విద్యార్థుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తిని పెంచేందుకు ‘ఇస్రో విజ్ఞాని’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీన్నే ‘ఇస్రో యువిక’ కార్యక్రమం అని కూడా పిలుస్తారు. దీనికి 9వ తరగతి, ఆపై తరగతి విద్యార్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. మే నెలలో 2 వారాల పాటు ‘ఇస్రో యువిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇస్రో అధికారిక పోర్టల్ jigyasa.iirs.gov.in ద్వారా మార్చి 20 వరకు దీనికి సంబంధించిన అప్లికేషన్లను విద్యార్థులు సమర్పించవచ్చు. ‘ఇస్రో యువిక’ యంగ్ సైంటిస్ట్ స్కీమ్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

‘ఇస్రో విజ్ఞాని’(ISRO Vigyani)  కార్యక్రమానికి ఎంపికయ్యే విద్యార్థులు ఇస్రో ప్రధాన కార్యాలయానికి వెళ్లి.. అక్కడి వర్కింగ్ పరిస్థితులను కళ్లారా చూసే అవకాశాన్ని దక్కించుకుంటారు.  సైన్స్ గురించి ఆయా విద్యార్థులకు ఇస్రో నిపుణులు తరగతులు నిర్వహిస్తారు. ఎంపికయ్యే విద్యార్థుల  మొదటి సెలక్షన్ లిస్టును మార్చి 28న రిలీజ్ చేస్తారు. రెండో లిస్టును ఏప్రిల్ 4న విడుదల చేస్తారు. ఎవరు ఎంపికయ్యారనే విషయాన్ని మెయిల్ ద్వారా ఇస్రో తెలియజేస్తుంది. మే 13 నుంచి 24  వరకు ‘ఇస్రో విజ్ఞాని’ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. మే 25న విద్యార్థులు.. ఇస్రో కేంద్రాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లిపోతారు.విద్యార్థుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి పెంచడమే ఇస్రో వైజ్ఞాని కార్యక్రమం లక్ష్యం.

  • ‘ఇస్రో విజ్ఞాని’ కార్యక్రమానికి అప్లై చేసుకునే విద్యార్థులు పాస్‌పోర్ట్ సైజు ఫొటో, ఆధార్ కార్డు, 8క్లాస్ మార్క్ షీట్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ కలిగి ఉండాలి.
  • https://jigyasa.iirs.gov.in/yuvika వెబ్‌సైట్‌లోకి వెళ్లి apply for yuvika registration ఆప్షన్‌పై క్లిక్ చెయ్యాలి.
  • ఆ వెంటనే రిజిస్ట్రేషన్ ఫామ్ తెరుచుకుంటుంది. అందులో పేరు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, అడ్రెస్ వంటివి నమోదు చేయాలి. ఆ తర్వాత మొబైల్, ఈమెయిల్‌కి OTP వస్తుంది.
  • ఓటీపీ వెరిఫికేషన్ పూర్తయ్యాక, లాగిన్ అయ్యి, space quiz లో పాల్గొనాలి.
  • పర్సనల్ వివరాలు, ఎడ్యుకేషన్ వివరాలు ఇచ్చి, ముఖ్యమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి సబ్‌మిట్ చెయ్యాలి.
  • https://jigyasa.iirs.gov.in/yuvika లో లాగిన్ అయ్యి.. అప్లికేషన్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.