ISRO Weather Satellite : 17న నింగిలోకి ఇస్రో వాతావరణ ఉపగ్రహం.. మనకేం లాభమో తెలుసా ?

ISRO Weather Satellite : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది.

  • Written By:
  • Updated On - February 9, 2024 / 08:12 AM IST

ISRO Weather Satellite : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి ఫిబ్రవరి 17న ఇస్రో నిర్వహించనున్న ఈ ప్రయోగం స్పెషల్. ఆ రోజు ప్రయోగించనున్న వాతావరణ ఉపగ్రహం ‘ఇన్సాట్ – 3డీఎస్‌’ కూడా స్పెషల్. ఆ రోజున సాయంత్రం 5:30 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F14 (GSLV F14) ద్వారా ప్రయోగం నిర్వహిస్తామని ఇస్రో వెల్లడించింది.  ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

వాతావరణ ఉపగ్రహ ప్రయోగం ముఖ్య అంశాలివే.. 

  • ‘ఇన్సాట్ – 3డీఎస్‌’ శాటిలైట్(ISRO Weather Satellite) వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి క్షణం ట్రాక్ చేసి అందిస్తుంటుంది. సముద్ర ఉపరితలాలపై నిరంతరం నిఘా పెడుతుంది. ఈ శాటిలైట్ పర్యావరణ విపత్తు హెచ్చరికలను అందించి మనల్ని అలర్ట్ చేస్తుంటుంది.
  • ఈ ప్రయోగానికి కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ నిధులను సమకూరుస్తోంది.
  • జియో సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జిటిఓ)లో ఈ శాటిలైట్‌ను మోహరిస్తారు.
  • గతంలో ఇస్రో ప్రయోగించిన ఇన్సాట్-3డీ, ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహాలతో పాటు ‘ఇన్సాట్ – 3డీఎస్‌’ శాటిలైట్ కూడా వాతావరణ సేవలను మెరుగుపరుస్తుంది.

Also Read : Maldives Vs India : మాల్దీవ్స్ నుంచి భారత సైన్యం వెనక్కి.. వారి ప్లేసులోకి వీరు !

  • భారత వాతావరణ విభాగం, మధ్యస్థ శ్రేణి వాతావరణ సూచనల జాతీయ కేంద్రం వంటి కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ విభాగాలు,ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరోలజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇతర ఏజెన్సీలు వాతావరణ అంచనాల కోసం ‘ఇన్సాట్ – 3డీఎస్‌’ ఉపగ్రహం పంపే డేటాను వాడుకుంటాయి.
  • ‘ఇన్సాట్ – 3డీఎస్‌’  ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లే  జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F14 51.7 మీటర్ల పొడవు ఉంటుంది.  దీని బరువు 420 టన్నులు.

Also Read : Facebook Live Murder : ఫేస్‌బుక్ లైవ్‌‌లోనే మర్డర్, సూసైడ్.. వీడియో వైరల్.. ‘మహా’ కలకలం

14 నెలల్లో 30 ప్రయోగాలకు రెడీ

ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇస్రో 30 ప్రాజెక్టులను చేపట్టనుంది. అంతరిక్ష రంగంలో ఇస్రో బలమైన విస్తరణకు ఈ ప్రాజెక్టులు తోడ్పడనున్నాయి. ఈ ప్రయోగాల్లో సగం అంతరిక్ష వాణిజ్య రంగానికి సంబంధించినవి. మిగతావి వాడకందారుల ప్రాయోజిత ప్రాజెక్టులు, శాస్త్ర పరిశోధనలు, సాంకేతికతను ప్రదర్శించే విమానాలకు చెందినవి. ఈ 14 నెలల్లో చేపట్టనున్న ప్రాజెక్టుల్లో ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌ ప్రయోగం కూడా ఉండటం గమనార్హం. గగన్‌యాన్ ప్రయోగానికి సంబంధించిన 7 పరీక్షలతోపాటు స్కైరూట్, అగ్నికుల్ వంటి ప్రైవేటు స్టార్టప్ కంపెనీలకు చెందినవి 7 మిషన్లు ఉన్నట్లు ఇన్ స్పేస్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని నాలుగో త్రైమాసికంలో ఇప్పటికే ఒక ప్రయోగం చేపట్టగా.. మరో 3 ప్రయోగాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక మిగితా ప్రయోగాలు వచ్చే ఆర్థిక ఏడాదిలో నిర్వహించనున్నారు. అయితే ఆ ప్రయోగాలకు సంబంధించిన తేదీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు.