ISRO Successfully Launch: LVM-30 రాకెట్ ప్రయోగం సక్సెస్.. అసలు ఈ వన్‌వెబ్ అంటే ఏమిటి..?

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఆదివారం ఏకకాలంలో 36 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇస్రో చేపట్టిన ఈ భారీ రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. సరిగ్గా అనుకున్న సమయానికే 9 గంటలకు నింగిలోకి LVM-30 దూసుకుపోయింది.

  • Written By:
  • Publish Date - March 26, 2023 / 11:14 AM IST

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఆదివారం ఏకకాలంలో 36 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇస్రో చేపట్టిన ఈ భారీ రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. సరిగ్గా అనుకున్న సమయానికే 9 గంటలకు నింగిలోకి LVM-30 దూసుకుపోయింది. వన్‌వెబ్ ఇండియా-2 పేరుతో 5,805 కిలోల బరువు కలిగిన 36 సమాచార ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ ఆనందం వ్యక్తం చేశారు.

మార్చి 26న ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాలను ప్రయోగించారు. 643 టన్నుల బరువు, 43.5 మీటర్ల పొడవున్న ఈ లాంచ్ వెహికల్ చంద్రయాన్-2 మిషన్‌తో సహా ఇప్పటివరకు ఐదు విజయవంతమైన ప్రయోగాలను పూర్తి చేసిన ఇస్రో అత్యంత భారీ ప్రయోగ వాహనం. ఈ 36 ఉపగ్రహాల బరువు 5805 టన్నులు.

అధికారిక సమాచారం ప్రకారం.. ఇస్రో రాకెట్ UK కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలతో కలిసి బయలుదేరింది. ఎల్వీఎం3 ప్రయాణించిన ఉపగ్రహాల మొత్తం బరువు 5 వేల 805 టన్నులు. ఈ మిషన్‌కు LVM3-M3 / OneWeb India-2 అని పేరు పెట్టారు. ఈ మిషన్ ప్రయోగం గురించి ఇస్రో ట్వీట్ ద్వారా తెలియజేసింది. LVM3 అనేది చంద్రయాన్-2 మిషన్‌తో సహా ఇప్పటివరకు ఐదు విజయవంతమైన ప్రయోగాలను పూర్తి చేసిన ఇస్రో అత్యంత భారీ ప్రయోగ వాహనం. వాస్తవానికి.. బ్రిటన్‌కు చెందిన వన్‌వెబ్ గ్రూప్ కంపెనీ 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌తో జతకట్టింది.భూ కక్ష్యలో 23 ఉపగ్రహాలు

ఇందులో ఇస్రో ఇప్పటికే 23 అక్టోబర్ 2022న 23 ఉపగ్రహాలను ప్రయోగించింది. నేడు మిగిలిన 23 ఉపగ్రహాలను భూ కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇస్రో ఈ ప్రయోగంతో భూ కక్ష్యలో వెబ్ వన్ కంపెనీకి చెందిన మొత్తం ఉపగ్రహాల సంఖ్య 616 అవుతుంది. అదే సమయంలో ఇస్రోకు ఈ ఏడాదిలో ఇది రెండో ప్రయోగం. ఇస్రో ప్రయోగం విజయవంతం కావడంతో వన్‌వెబ్ ఇండియా-2 అంతరిక్షంలో 600 కంటే ఎక్కువ దిగువ భూ కక్ష్య ఉపగ్రహాల కూటమిని పూర్తి చేసింది.

OneWeb అంటే ఏమిటి..?

OneWeb శాటిలైట్ అంటే ఇది UK ఆధారిత కమ్యూనికేషన్ కంపెనీ. UK ప్రభుత్వంతో పాటు భారతదేశానికి చెందిన ఇండియన్ ఎంటర్‌ప్రైజెస్, ఫ్రాన్స్‌కు చెందిన యూటెల్‌శాట్, జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్, అమెరికాకు చెందిన హ్యూయ్ నెట్‌వర్క్స్, దక్షిణ కొరియాకు చెందిన హన్వా ప్రధాన భాగస్వాములు. దీని ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడమే ఈ సంస్థ లక్ష్యం.

OneWeb ISROతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని కింద మార్చి 26న 36 ఉపగ్రహాలను తక్కువ భూమి కక్ష్యలో ఉంచారు. గత ఏడాది కూడా ఇస్రో సంస్థకు చెందిన 36 ఉపగ్రహాలను అమర్చింది. మొత్తం 72 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఒప్పందం కుదిరింది. ఇందుకోసం మొత్తం వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ప్రయోగ రుసుము వసూలు చేస్తున్నారు. ఇది ఇస్రో అతిపెద్ద ఆర్డర్‌లలో ఒకటి.