Site icon HashtagU Telugu

ISRO Earning: వేల కోట్లు సంపాదిస్తున్న ఇస్రో..

ISRO Earning

ISRO Earning

ISRO Earning: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అంతరిక్ష రంగంలో బలమైన శక్తిగా ఎదుగుతోంది. ఇటీవల సంవత్సర కాలంలో అద్భుతాలను సృష్టిస్తోంది. శాటిలైట్ సేవలు, వాణిజ్య పరంగా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో దూసుకెళ్తుంది. అంతరిక్ష వాణిజ్యంలో ఇతర దేశాలు, ప్రైవేట్ సంస్థలతో పోటీ పడుతూ వరుస విజయాలను నమోదు చేసుకుంటోంది. గత 4-5 ఏళ్లలో భారత అంతరిక్ష పరిశోధన రంగంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఇటీవల జరిగిన ఓ సమావేశంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఇస్రో డబ్బు ఎలా సంపాదిస్తుంది అన్న దానిపై స్పందించారు.

భారతీయ శాస్త్రవేత్తలు ప్రతిభ, సామర్థ్యం, ​​అభిరుచితో పనిచేస్తున్నారని జితేంద్ర సింగ్ అన్నారు. గతంలో వీరికి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో ప్రగతి కుంటుపడిందన్నారు. మోడీ రాకతో ప్రైవేట్ ఛానెళ్ల పెట్టుబడులు పెరుగుతున్నాయన్నారు. అమెరికా, రష్యా వంటి ఇతర దేశాలు ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా వచ్చే ఆదాయం గురించి చెప్పారు.

NASA వనరులలో సగం ప్రైవేట్ పెట్టుబడి నుండి వచ్చినట్లు అతను చెప్పాడు. ప్రస్తుతం ఇస్రో దాదాపు రూ.1000 కోట్ల ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తోందని తెలిపారు. భారత్ నుంచి అమెరికా, రష్యాలకు చెందిన ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెడుతోంది. తద్వారా డబ్బు ఆదా అవుతుందని చెప్పారు.

వాణిజ్య ప్రయోగాల ద్వారా ఇతర దేశాల ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా ఇస్రో ఇప్పటి వరకు రూ.4,000 కోట్లకు పైగా ఆర్జించిందని మంత్రి వెల్లడించారు. ఈ క్రమంలో పలు దేశాలకు చెందిన దాదాపు 430 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, జపాన్, మలేషియా, సింగపూర్, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా వంటి దేశాలకు ఇస్రో సేవలు అందించిందని వివరించారు. ఐరోపా దేశాల నుంచి రూ.2,635 కోట్లు, అమెరికా నుంచి రూ.1,417 కోట్లు సంపాదించినట్లు సింగ్ తెలిపారు.

Also Read: Broom: చీపురు విషయంలో అలాంటి నియమాలు పాటించకపోతే దురదృష్టం పట్టిపీడించడం ఖాయం?

Exit mobile version