Isro Space Station : అంతరిక్షంలో ఇస్రో స్పేస్ స్టేషన్.. ఇండియా మెగా ప్లాన్

Isro Space Station : వచ్చే 25 ఏళ్లలోగా అంతరిక్షంలో సొంతంగా స్పేస్‌ స్టేషన్‌ ను నిర్మించడానికి ప్లానింగ్ ను రెడీ చేస్తున్నామని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. 

  • Written By:
  • Publish Date - October 6, 2023 / 01:09 PM IST

Isro Space Station : వచ్చే 25 ఏళ్లలోగా అంతరిక్షంలో సొంతంగా స్పేస్‌ స్టేషన్‌ ను నిర్మించడానికి ప్లానింగ్ ను రెడీ చేస్తున్నామని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.  దీర్ఘకాలం పాటు ప్రయాణించగలిగే మానవ సహిత స్పేస్ క్రాఫ్ట్ ను కూడా తయారు చేస్తామని ఆయన ప్రకటించారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈవివరాలను తెలిపారు. స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం వల్ల భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందనే కోణంలో ప్రస్తుతం స్టడీ చేస్తున్నామని సోమనాథ్ చెప్పారు. రోబోటిక్‌ ఆపరేషన్‌తో  సమీప భవిష్యత్తులో స్పేస్‌ స్టేషన్‌ను నిర్మిస్తామని తెలిపారు.  ప్రస్తుతం మానవ సహిత స్పేస్ క్రాఫ్ట్  భారత్‌కు లేనందున దాన్ని రెడీ చేసి.. అమెరికా, రష్యా, చైనాల సరసన చేరాలని భావిస్తున్నామన్నారు. ‘‘గగన్‌యాన్‌పై ఇస్రో దృష్టి పెట్టింది. వ్యోమగాములను అంతరిక్షానికి పంపి, అక్కడ స్పేస్‌ స్టేషన్‌ నిర్మించాలని యోచిస్తోంది’’ అని వివరించారు. అన్నీ కలిసొస్తే రాబోయే 20-25 ఏళ్లలోగా ఇస్రో సొంతంగా స్పేస్‌ స్టేషన్‌ ను నిర్మిస్తుందని సోమనాథ్ (Isro Space Station)  ఆశాభావం వ్యక్తం చేశారు.

Also read : Social Media: సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, శిక్షలు ఉండవు

435 అప్రెంటీస్​ పోస్టులు.. అక్టోబర్ 7న ఇంటర్వ్యూలు

ఇస్రో  435 అప్రెంటీస్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు.. కేరళ, తిరువనంతపురంలోని విక్రమ్​ సారాబాయి స్పేస్ సెంటర్​లో పనిచేయాల్సి ఉంటుంది. 273 గ్రాడ్యుయేట్​ అప్రెంటీస్​ పోస్టులు, 162 టెక్నీషియన్​ అప్రెంటీస్ పోస్టులను ఇస్రో భర్తీ చేస్తోంది. ఎయిరోనాటికల్​/ ఎయిరోస్పేస్​, కెమికల్​, సివిల్​, కంప్యూటర్ సైన్స్​, ఎలక్ట్రికల్​, ఎలక్ట్రానిక్స్​, మెకానికల్​, మెటలర్జీ, ప్రొడక్షన్​, ఫైర్​ అండ్ సేఫ్టీ, హోటల్​ మేనేజ్​మెంట్ అండ్ క్యాటరింగ్​, టెక్నాలజీ డిపార్ట్​మెంట్స్ లలో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా.. బీటెక్​/ బీఈ/ బీఎస్సీ/ బీకాం/ బీఏ/ హోటల్​ మేనేజ్​మెంట్ కోర్సుల్లో 60 శాతం కంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.కేరళలోని  ఎర్నాకుళం జిల్లా కలమస్సేరిలో ఉన్న గవర్నమెంట్​ పాలిటెక్నికల్ కాలేజీలో అక్టోబర్ 7 అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.  ఆసక్తిగల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

  • టెక్నీషియన్​ అప్రెంటీస్​ పోస్టులకు మాత్రం.. సంబంధిత విభాగాన్ని అనుసరించి ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు లోపు ఉండాలి.టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి పరీక్ష, ఇంటర్వ్యూ రెండూ నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను సదరు ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
  • గ్రాడ్యుయేట్ అప్రెంటీస్​ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లు లోపు ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎవరికైతే మెరిట్ మార్కులు వస్తాయో.. వారినే అప్రెంటీస్ పోస్టుల కోసం ఎంపిక చేస్తారు.

We’re now on WhatsApp. Click to Join