Site icon HashtagU Telugu

Modi – Netanyahu – Phone Call : ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ పీఎం ఫోన్ కాల్.. ఏం చర్చించారంటే ?

Modi Netanyahu Phone Call

Modi Netanyahu Phone Call

Modi – Netanyahu – Phone Call : ఇజ్రాయెల్‌ -హమాస్ యుద్దం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ కాల్ చేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ సరిహద్దులలో నెలకొన్న పరిస్థితుల గురించి మోడీకి వివరించారు. హమాస్ మిలిటెంట్లు సృష్టిస్తున్న విధ్వంసం వివరాలను, ఇప్పటివరకు సంభవించిన ప్రాణనష్టం సమాచారాన్ని చెప్పారు. దీనికి స్పందించిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ‘‘ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారతీయులందరూ ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తున్నారు. భారతదేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు. ఇజ్రాయెల్‌పై జరిగిన ఈ దాడిని ఖండిస్తున్నాను’’ అని ఫోన్ కాల్ లో చెప్పారు. నెతన్యాహుతో ఫోన్ కాల్ ముగిసిన అనంతరం ఇవే వివరాలతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో ఒక పోస్టు పెట్టారు. నెతన్యాహుతో జరిగిన సంభాషణ గురించి అందులో ప్రస్తావించారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘ఇజ్రాయెల్‌పై పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ జరిపిన రాకెట్ దాడి ఒక టెర్రర్ ఎటాక్. ఈ ఉగ్రదాడి వార్తతో మేం షాక్‌కు గురయ్యాం. ఈ దాడిలో మరణించినవారి కుటుంబాలకు మా తరఫున ప్రగాఢ సానుభూతి’’ అని పేర్కొంటూ ప్రధాని మోడీ ట్వీట్ లో పేర్కొన్నారు. గత శనివారం నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య తీవ్ర యుద్ధం జరుగుతోంది. ఇరువైపులా కలుపుకొని మొత్తం 1600 మందికిపైగా చనిపోయారు. 900 మంది ఇజ్రాయెల్ లో, 700 మంది పాలస్తీనాలో ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత ప్రధానికి ఇజ్రాయెల్ ప్రధాని కాల్ చేసి మాట్లాడటం ఇదే(Modi – Netanyahu – Phone Call) తొలిసారి.

Also read : Mukesh Ambani: భారతదేశంలో అత్యంత సంపన్న వ్యక్తిగా ముఖేష్ అంబానీ.. మొత్తం సంపద ఎంతంటే..?