ISIS : ఢిల్లీలో పోలీసులు ఐసిస్‌తో సంబంధం ఉన్న ఒక ఉగ్రవాదిని అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ అరెస్టు తర్వాతే స్పెషల్ సెల్, కేంద్ర ఏజెన్సీలు, రాష్ట్ర పోలీస్ విభాగాలు కలిసి ఒక సంయుక్త ఆపరేషన్‌ను చేపట్టాయి. దాదాపు 12కి పైగా రాష్ట్రాల్లో ఒకేసారి దాడులు జరగగా, ఎనిమిది మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో ప్రధాన నిందితుడిగా గుర్తించబడిన ఆఫ్తాబ్ ముంబైకి చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు. అతనికి దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాపించిన ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. ఈ ఆధారాల ఆధారంగా మరిన్ని ప్రదేశాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
CM Revanth Reddy : రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ
ఈ ఆపరేషన్‌లో అత్యంత కీలక ఘట్టం రాంచీలో చోటు చేసుకుంది. జార్ఖండ్ ATS, ఢిల్లీ పోలీసులు, రాంచీ పోలీస్ సంయుక్తంగా రాంచీ నగరంలోని ఒక లాడ్జ్‌పై దాడి చేసి అనుమానిత ఐసిస్ ఉగ్రవాది అషర్ డానిష్‌ను అరెస్టు చేశారు. అతను బొకారో జిల్లాలోని పెట్వార్ ప్రాంతానికి చెందినవాడని తెలుస్తోంది. డానిష్ వద్ద నుండి పలు అనుమానాస్పద పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, మరియు అభ్యంతరకరమైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
రాంచీలోని లోయర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్లాం నగర్ ప్రాంతంలో మరో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా రాంచీ నగరం ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయంగా మారిందని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. అందువల్లే ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ తాజా అరెస్టు ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం అరెస్టయిన వారిని పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. ఐసిస్ నెట్‌వర్క్‌తో వారి సంబంధాలు ఎంతవరకు ఉన్నాయో, దేశంలో ఇంకా ఎన్ని ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి కసరత్తు చేస్తున్నారు.
అధికారులు భావిస్తున్నట్లుగా, ఈ కేసు దర్యాప్తులో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన వివరాలు బయటపడే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆపరేషన్‌తో ఐసిస్ ముఠాలకు భారీ దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. అయితే ఈ అరెస్టులు కేవలం ఆరంభం మాత్రమేనని, పెద్ద కుట్ర వెనుక ఉన్న ముఠాలను గుర్తించేందుకు పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు మరింత లోతుగా దర్యాప్తు చేస్తాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
High Alert : నేపాల్‌లో ఉద్రిక్తతలు: భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్..రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రత