Fake Currency Note: కరెన్సీ నోటు ఒరిజినలా? నకిలీదా? తెలుసుకోవడం ఎలా?

  • Written By:
  • Publish Date - April 12, 2023 / 09:16 AM IST

సైబర్ నేరాలు ఓ వైపు, ఆన్ లైన్ మోసాలు మరోవైపు…మధ్య డబ్బులకు టొకరాలు. ఇలా రోజుకో కొత్త మోసం వెలుగు చూస్తున్నాయి. మొన్నటికి మొన్న ఏపీలో గ్రామ వాలంటీర్ల ఫించన్ల డబ్బుల్లో నకిలీ కరెన్సీ (Fake Currency Note) నోట్లు కలకలం రేపాయి. ఈ తరుణంలో మీ వద్ద ఉన్న 100, 500 లేదా 2000 రూపాయల నోట్లు అసలైనవో కాదో తెలుసుకోవడం ఎలా. అసలు, నకిలీ కనిపెట్టేందుకు ఆర్బీఐ ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేసిందో తెలుసుకుందాం.

-భారతీయ కరెన్సీ నోట్లపై ఒక వాటర్‌మార్క్ ఉంటుంది. నోటుపై కాంతిపడినప్పుడు అది కనిపిస్తుంది. వాటర్‌మార్క్ మహాత్మా గాంధీ యొక్క చిత్రం, నోటుకు ఎడమ వైపున కనిపిస్తుంది.

-భారతీయ కరెన్సీ నోట్ల మధ్యలో సెక్యూరిటీ థ్రెడ్ నేరుగా కనిపిస్తుంది. ఈ థ్రెడ్‌పై నోటు విలువతో పాటు RBI అని వ్రాయబడి ఉంటుంది.

-అసలైన భారతీయ కరెన్సీ నోట్లు పదునైన గీతలతో మెరుగైన ముద్రణ నాణ్యతను కలిగి ఉంటాయి. అవి నకిలీ నోట్లలో ఉండవు.

-అన్ని భారతీయ కరెన్సీ నోట్లకు సీ-త్రూ రిజిస్టర్ ఉంటుంది, ఇది నోటు ముందు, వెనుక భాగంలో ముద్రించబడిన నోటు విలువ యొక్క చిత్రం, ఇది వెలుతురుకు పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా సమలేఖనం అవుతుంది.

-భారతీయ కరెన్సీ నోట్లలో సూక్ష్మ అక్షరాలు కూడా ఉంటాయి. వీటిని భూతద్దంలో చూడవచ్చు. అసలు నోట్లపై సూక్ష్మ అక్షరాలు స్పష్టంగా ఉంటాయి కానీ నకిలీ నోట్లపై అస్పష్టంగా ఉంటాయి.

-15భాషల్లో నోటు విలువను పేర్కొంటూ భాష ప్యానెల్ ఉంటుంది.

-నోటుపై స్వచ్చభారత్ నినాదంతో కూడిన లోగో ఉంటుంది.

-లాంగ్వేజ్ ప్యానెల్ పక్కన ఎర్రకోట చిహ్నం ఉంటుంది.