Medical Emergency : మెడికల్ ఎమర్జెన్సీ దిశగా పాక్?

Medical Emergency : ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మెడికల్ ఎమర్జెన్సీ (Medical Emergency) ప్రకటించే పరిస్థితి కూడా ఏర్పడొచ్చని భావిస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
Pakistan Medical Emergency

Pakistan Medical Emergency

పాకిస్థాన్‌(Pakistan)లో ఆరోగ్య రంగం తీవ్ర సంక్షోభానికి గురి అవుతుందని తెలుస్తుంది. అక్కడి వైద్యశాఖ అత్యవసర పరిస్థితిని ముందుగానే ఊహిస్తూ, కొన్నిరకాల ఔషధాలను తక్షణమే నిల్వ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మెడికల్ ఎమర్జెన్సీ (Medical Emergency) ప్రకటించే పరిస్థితి కూడా ఏర్పడొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని అరుదైన వ్యాధులకు సంబంధించిన మందుల కొరత తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

ED Office Fire: ఈడీ ఆఫీసు భవనంలో భారీ అగ్నిప్రమాదం

పాకిస్థాన్ తన ఫార్మాస్యూటికల్ అవసరాల్లో 30-40 శాతం మందులు భారత్ నుంచే దిగుమతి చేసుకునేది. క్యాన్సర్, రేబీస్‌, పాము కాటు వంటి సీరియస్ ఆరోగ్య సమస్యలకు అవసరమైన మందులు ఇందులో ప్రధానంగా ఉండేవి. అయితే భారత్‌తో ట్రేడ్ డీల్‌ను రద్దు చేసుకోవడం వల్ల ఈ ఔషధాల లభ్యతపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో అక్కడి ప్రజలు అత్యవసర ఔషధాల కొరతను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వం మెడిసిన్ అవసరాలను తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతుంది. ఇతర దేశాల నుండి మందులు దిగుమతి చేసుకోవడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే అంతర్రాష్ట్ర సంబంధాలు, ఆర్థిక పరిమితులు కారణంగా ఇది తేలికపాటి పని కాదని నిపుణులు భావిస్తున్నారు. త్వరలోనే తగిన చర్యలు తీసుకోకపోతే, పాక్‌లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి తప్పదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  Last Updated: 27 Apr 2025, 11:07 AM IST