Nipah Virus: కరోనా మరణాల రేటు కంటే నిఫా వైరస్ మరణాల రేటు అధికమయ్యే అవకాశముందని వైద్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం కేరళలో నిఫా చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్, డాక్టర్ రాజీవ్ బహ్ల్ మాట్లాడుతూ..నిపా వైరస్ మరణాల రేటు 40-70 శాతం ఉందని, అయితే COVID-19 కేవలం 2-3 శాతం మాత్రమేనని పేర్కొన్నారు. కేరళలో ప్రస్తుత నిపా వైరస్ వ్యాప్తి 2018 నుండి నాల్గవది. అక్కడ ఇప్పటివరకు ఆరుగురికి సోకింది, ఇద్దరు ఈ వ్యాధిబారీన పడి మరణించారు.ఈ వైరస్ కు వ్యాక్సిన్ ఇంకా అందుబాటులో లేకపోవడంతో నియంత్రణ ఒక్కటే మార్గమని అన్నారు. నిపా వైరస్ చికిత్స కోసం మరో 20 డోసుల మోనోక్లోనల్ యాంటీబాడీని సేకరించేందుకు భారత్ ఆస్ట్రేలియాకు చేరుకుందన్నారు.
నిపా వైరస్ లక్షణాలు:
జ్వరం
తలనొప్పి
కండరాల నొప్పి
వాంతులు
గొంతు మంట
నిద్రమత్తు
మైకము మొదలైనవి.
ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వైరస్ పందులు, మేకలు, కుక్కలు మరియు పిల్లుల ద్వారా కూడా వ్యాపిస్తుంది. శరీర ద్రవాల ద్వారా అలాగే సోకిన జంతువు ద్వారా కలుషితమైన ఆహారం ద్వారా వ్యక్తి నుండి వ్యక్తికి సోకుతుంది. నిపా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వాటిలో కొన్ని తరచుగా చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం మొదలైనవి.
Also Read: TDP-JSP : టీడీపీ – జనసేన పొత్త.. విజయవాడ వెస్ట్ సీటు జనసేనకే..?