Harsh Goenka : హర్ష్ గోయెంకా.. రూ.33వేల కోట్లు విలువైన ఆర్‌పీజీ గ్రూప్ వ్యాపారాలకు అధిపతి. ఎన్నో వ్యాపారాలను నడుపుతున్నప్పటికీ.. ఆయన సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో తరుచుగా ఇంటరాక్ట్ అవుతుంటారు. సందర్భాన్ని బట్టి తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేస్తుంటారు. ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. యావత్ దేశం ఈ ఎన్నికలను నిశితంగా గమనిస్తోంది. ప్రత్యేకించి వ్యాపార వర్గానికి మహారాష్ట్ర ఎన్నికలు కీలకం. ఎందుకంటే.. మన దేశ వాణిజ్య రాజధాని ముంబై ఉన్నది మహారాష్ట్రలోనే. ఇవాళ ముంబైలో జరుగుతున్న పోలింగ్‌పై హర్ష్ గోయెంకా సంచలన ట్వీట్ చేశారు. ముంబై నగరంలోని మలబార్ హిల్స్ ఏరియాలో ఎక్కువమంది సెలబ్రిటీలు నివసిస్తుంటారు. ఆ ఏరియాలో పోలింగ్ చాలా మందకొడిగా జరుగుతోంది. ఈ అంశాన్ని తన ట్వీట్‌లో ప్రస్తావించిన హర్ష్ గోయెంకా(Harsh Goenka).. సెలబ్రిటీలు ఓటు వేసేందుకు దూరంగా ఉండటాన్ని తప్పుపడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
The men and women of Malabar Hill may not vote today because… they’re busy debating whether their chauffeur will take the Mercedes or the BMW to the polling booth. It’s the fear of dirtying their designer loafers on uneven roads, the struggle of matching their Gucci sunglasses…
— Harsh Goenka (@hvgoenka) November 19, 2024
Also Read :Anmol Bishnoi Custody : అమెరికా ‘ఇమిగ్రేషన్’ కస్టడీకి అన్మోల్ బిష్ణోయి.. అయోవా జైలుకు తరలింపు
‘‘మలబార్ హిల్‌లో ఉండే సంపన్నులు, సెలబ్రిటీలు డైలమాలో ఉన్నారేమో.. పోలింగ్ కేంద్రానికి మెర్సిడెస్ బెంజ్‌లో వెళ్లాలా.. బీఎండబ్ల్యూలో వెళ్లాలా అనే దానిపై వాళ్లు చర్చిస్తూ కూర్చున్నారు అనుకుంట’’ అని హర్ష్ గోయెంకా కామెంట్ చేశారు. ‘‘మనీష్ మల్హోత్రా అవుట్‌ఫిట్‌కు ఏ కళ్లజోడు పెట్టుకుంటే నప్పుతుందో చెక్ చేసుకుంటూ సెలబ్రిటీలు కష్టపడిపోతున్నారేమో.. సంపన్నులు ఓటు వేసే దాకా.. ప్రజాస్వామ్యం వేచి చూడాల్సిందేనా’’ అని ఆయన అసహనం వ్యక్తంచేశారు. ‘‘పోలింగ్ బూత్ వద్ద వాలెట్ పార్కింగ్ ఉందా.. లేదా.. అని మలబార్ హిల్ సెలబ్రిటీలు ఆలోచిస్తున్నారు అనుకుంట. క్యూలో సాధారణ ప్రజలతో కలిసి నిలబడి ఓటు వేయాల్సి వస్తుందని వాళ్లు భయపడుతున్నారేమో’’ అని గోయెంకా కామెంట్ చేశారు. ఇప్పటివరకు ముంబై నగరంలో ఓటు వేసిన ప్రముఖుల జాబితాలో సచిన్ టెండూల్కర్, అక్షయ్ కుమార్ తదితరులు ఉన్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సహా పలువురు ప్రముఖులు ఇంకా ఓటు వేయాల్సి ఉంది.