Site icon HashtagU Telugu

Fact Check: రైతులకు ‘పీఎం కిసాన్‌ ట్రాక్టర్‌ స్కీమ్‌’.. అసలు నిజం ఇదే..!

𝐏𝐌 𝐊𝐢𝐬𝐚𝐧 𝐓𝐫𝐚𝐜𝐭𝐨𝐫 𝐘𝐨𝐣𝐚𝐧𝐚

Safeimagekit Resized Img (3) 11zon

Fact Check: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన వంటి అనేక పథకాలను అమలు చేస్తోంది. దీని ద్వారా ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం అందజేస్తుంది. చాలా సార్లు ప్రజలు సోషల్ మీడియా నుండి ప్రభుత్వ వివిధ పథకాల గురించి సమాచారాన్ని పొందుతారు. రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కిసాన్‌ ట్రాక్టర్‌ స్కీమ్‌’ని (𝐏𝐌 𝐊𝐢𝐬𝐚𝐧 𝐓𝐫𝐚𝐜𝐭𝐨𝐫 𝐘𝐨𝐣𝐚𝐧𝐚) ప్రారంభించిందని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ పథకం కింద రైతులకు ట్రాక్టర్ల కొనుగోలుపై ప్రభుత్వం సబ్సిడీని అందజేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిజంగానే ఇలాంటి పథకాన్ని ప్రారంభించిందా, రైతులకు ఎంత మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

రైతులను ఆదుకునేందుకు, వారిని స్వావలంబన చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్‌ ట్రాక్టర్‌ పథకాన్ని ప్రారంభించిందని సోషల్‌ మీడియాలో వైరల్‌గా ప్రచారం జరుగుతోంది. ఈ పథకం కింద రైతులకు ట్రాక్టర్ల కొనుగోలుపై సబ్సిడీ ఇస్తామని వ్యవసాయ శాఖ చెప్పినట్లు వైరల్‌గా ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచి ఈ పథకంపై చర్చలు మొదలయ్యాయి. దీనితో పాటుగా ఒక వెబ్‌సైట్‌కు లింక్‌ను కూడా పంపారు. అందులో వారు లాగిన్ చేసి పథకం ప్రయోజనాలను పొందాలనుకునేవారు తమ డీటెయిల్స్ పూర్తి చేయాలనీ ఉంది. ఇప్పుడు PIB ఈ వైరల్ క్లెయిమ్ నిజాన్ని కనుగొంది. మేము దాని గురించి మీకు చెప్పబోతున్నాం.

Also Read: Mukesh Ambani: ముఖేష్ అంబానీ నికర విలువ ఎంతంటే..? సంపన్నుల జాబితాలో ఎన్నో స్థానంలో ఉన్నారంటే..?

PIB వాస్తవానికి ఈ పథకాన్ని తనిఖీ చేసింది. దాని అధికారిక X హ్యాండిల్‌లో సందేశాన్ని షేర్ చేసింది. ఇందులో పథకం నిజం గురించి సమాచారం ఇచ్చింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ ట్రాక్టర్ పథకం పేరుతో ఎటువంటి సబ్సిడీ పథకాన్ని ప్రారంభించలేదు. సబ్సిడీపై ట్రాక్టర్లను అందజేస్తామని క్లెయిమ్ చేస్తున్న ఈ వెబ్‌సైట్ నకిలీదని పేర్కొంది.

భారతదేశంలో పెరుగుతున్న డిజిటలైజేషన్‌తో.. ఆన్‌లైన్ మోసానికి సంబంధించిన కేసులు వేగంగా పెరిగాయి. ఈ రోజుల్లో చాలా మంది సైబర్ నేరగాళ్లు ప్రజలను వివిధ నకిలీ ప్రభుత్వ పథకాలతో ఆకర్షిస్తూ వారి వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించి బ్యాంకింగ్ మోసానికి పాల్పడుతున్నారు. అంతే కాకుండా వివిధ పథకాల పేరుతో డబ్బులు కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఏదైనా ప్రభుత్వ పథకం క్లెయిమ్‌లను విశ్వసించే ముందు.. ఒకసారి ప్రభుత్వ వెబ్‌సైట్‌ను సందర్శించి పథకం గురించి సమాచారాన్ని పొందండి.

We’re now on WhatsApp. Click to Join.