Ramayana Tourist Train: రామాయణ పుణ్యక్షేత్రాలు చూసేయండి..ఒకే ట్రిప్పులో!!!

రైల్వేశాఖకు చెందిన IRCTCఒక గొప్ప పనికి నాంది పలకనుంది. రామాయణ విశేషాలన్నీ చూపించే భారత్ గౌరవ్ టూరిస్టు ట్రెయిన్ సర్వీసును జూన్ 21నుంచి ప్రారంభించనుంది.

  • Written By:
  • Publish Date - May 5, 2022 / 03:28 PM IST

రైల్వేశాఖకు చెందిన IRCTCఒక గొప్ప పనికి నాంది పలకనుంది. రామాయణ విశేషాలన్నీ చూపించే భారత్ గౌరవ్ టూరిస్టు ట్రెయిన్ సర్వీసును జూన్ 21నుంచి ప్రారంభించనుంది. రామాయణ సర్య్కూట్ పేరుతో అయోధ్య నుంచి భద్రాచలం వరకు ఎన్నో క్షేత్రాలు చూపించనుంది. 18రోజుల పాటు ఈ యాత్ర ఉండగా…ఒక్కరికి ఛార్జీ రూ. 62,370. మొదట బుక్ చేసుకునే వంద మందికి 10శాతం తగ్గింపు ఇస్తున్నట్లు IRCTC ప్రకటించింది.

శ్రీరాముడి జన్మస్థలం నుంచి ప్రారంభించి…వనవాసం వరకు ఆయన జీవితంలో భాగమైన ఎన్నోవిశేష స్థలాలను ఈ యాత్రలో భాగంగా చూడవచ్చు. ఈ రైలు మొదటిరోజు ఢిల్లీ నుంచి బయల్దేరనుంది. మొదటిస్టాప్ ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య. ఇక్కడ శ్రీరాముడి జన్మస్థలం, రామజన్మభూమి ఆలయం, హనుమాన్ టెంపుల్, నందిగ్రామ్ లో భరత్ మందిర్ ఇవన్నీ చూపిస్తారు.

ఆ తర్వాత వచ్చే బీహార్ లోని బుక్సర్ కు…అక్కడ మహర్షి విశ్వామిత్రుడి ఆశ్రమం చూపిస్తారు. రామ్ రేఖ ఘాట్ వద్ద గంగాస్నాం చేయవచ్చు. అక్కడి నుంచి రైలు సీతమ్మ జన్మస్థలమైన సీతామహార్షికి తీసుకెళ్తుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గలో నేపాల్ లోని జనక్ పూర్ తీసుకెళ్తారు. అక్కడ రామజానకి ఆలయాన్ని చూడొచ్చు. అక్కడి నుంచి తిరిగి సీతామర్హికి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి వారణాసి…అక్కడి విశేషాలన్నీ చూపిస్తారు. తర్వాత రైలు మహారాష్ట్ర చేరుకుంటుంది.

నాసిక్ లోని త్రయంబకేశ్వరం ఆలయం, పంచవటిని చూపిస్తారు. అక్కడి నుంచి కర్నాటక హంపి, కిష్కిందకు చేరుకుంటుంది. హనమంతుడి జన్మస్థలంగా భావించే ఇక్కడ హనుమాన్ ఆలయాన్ని చూడొచ్చు. తర్వాత తమిళనాడులోని రామేశ్వరంకు చేరుకుంటారు. రామనాథస్వామి దర్శనం, దనుష్కోటి చూసి రావచ్చు. అక్కడి నుంచి రైలు కాంచీపురం, శివకాంచి, విష్ణుకంచి, కామాక్షిఅమ్మవారి ఆలయాలు దర్శనం చేసుకోవచ్చు.
చివరగా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం క్షేత్రదర్శనం ఉంటుంది. కొత్తగూడెంలోని భద్రాచలం రోడ్డుకు చేరుకుంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలోవెళ్లి భద్రాచలం దర్శనం చేసుకోవాలి. తిరిగి రైలు ప్రయాణికులను ఢిల్లీ తీసుకెళ్తుంది. ఇక రైలులో ఆహారపదార్థాలు వండి వడ్డించేందుకు ప్యాంట్రీకార్, సీసీటీవీ కెమెరా, ఇన్నోటెయిన్ మెంట్ సిస్టమ్, సెక్యూరిటీ గార్డ్ వంటి ఏర్పాట్లు ఉంటాయని ఐఆర్ సిటీసీ ప్రకటించింది.