IRCTC – Ayodhya : అయోధ్య రైల్వే స్టేషన్‌లో ఇక ఆ సదుపాయాలు కూడా..

IRCTC - Ayodhya : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్​‌సీటీసీ) కీలక ప్రకటన చేసింది.

  • Written By:
  • Updated On - February 9, 2024 / 12:32 PM IST

IRCTC – Ayodhya : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్​‌సీటీసీ) కీలక ప్రకటన చేసింది. దేశం నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు పోటెత్తుతున్న నేపథ్యంలో ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రైల్వే స్టేషన్‌లో  దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన రుచికరమైన వంటకాలను పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని ఐఆర్‌సీ​టీసీ తెలిపింది. దక్షిణ భారతదేశానికి చెందిన ఇడ్లీ, దోశ, సాంబార్, ఊతప్పంతోపాటు ఉత్తర భారతానికి చెందిన కాశ్మీరీ దమ్ ఆలూ, యఖ్నీ, రోగంజోష్, తుక్దియా భాత్, ధామ్‌లు అందుబాటులోకి తెస్తామని ఐఆర్​సీటీసీ స్పష్టం చేసింది. ఈస్ట్ ఇండియాలో ఫేమస్​​ అయిన మామ్ చామ్, రస్గుల్లాతో పాటు పశ్చిమ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పూరాన్ పోలీ, ధోక్లా, స్టఫ్డ్ బ్రింజాల్, జుంకా భక్రీ, ఖమాన్ కక్డీ, చౌలఫలి, మక్కీ పనీర్ పకోడా, పాపడ్ కీ సబ్జీ, కోరిస్ పావు వంటి వంటకాలను అయోధ్య స్టేషన్‌లో అందుబాటులో ఉంచనుంది.

We’re now on WhatsApp. Click to Join

ప్రధాని మోడీ ప్రారంభించిన కొత్త అయోధ్య రైల్వే స్టేషన్ భవనంలో రిటైరింగ్​​ రూమ్ నిర్మాణం కూడా జరుగుతోంది. 200 నుంచి 300 మంది కూర్చునే సౌకర్యం ఉండేలా దీన్ని నిర్మిస్తున్నారు.  వసతి గృహంలో వందల సంఖ్యలో బెడ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్య రైల్వే స్టేషనులో ప్రయాణికుడు రైలు దిగిన వెంటనే రిటైరింగ్​ రూమ్​లో బెడ్ బుక్ చేసుకుని ఫ్రెష్ అవ్వవచ్చు. ప్రస్తుతం ఐఆర్​సీటీసీ ఈ డార్మిటరీని(IRCTC – Ayodhya) సిద్ధం చేస్తోంది. త్వరలోనే అది అందుబాటులోకి రానుంది. హోటళ్లతో పోలిస్తే, డార్మిటరీలో బెడ్​ను బుక్​ చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది. టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్​ను కూడా రైల్వే స్టేషనులో నిర్మిస్తున్నారు. దీని ద్వారా పర్యటకులు అయోధ్యలోని సందర్శనాస్థలాల గురించి పూర్తి సమాచారం పొందొచ్చు.

Also Read : BJP – TDP – YCP : ఒకేసారి చంద్రబాబు, జగన్‌లతో బీజేపీ చర్చలు.. వ్యూహం అదేనా ?

కేఎఫ్‌సీ త్వరలో అయోధ్యలోనూ దుకాణాలు తెరవబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో  జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. అయోధ్యలో మాంసాహార విక్రయాలపై నిషేధం ఉందని స్పష్టం చేసింది. కావాలంటే వారు శాకాహార పదార్థాలు అమ్ముకోవచ్చని తెలిపింది. మాంసం, చేపలు, ఇతర మాంసాహార పదార్థాల విక్రయం, వినియోగాన్ని రామాలయ ప్రాణప్రతిష్ఠకు ముందే యోగి ప్రభుత్వం నిషేధించిందని గుర్తు చేసింది. అయితే, అయోధ్యకు 15 కిలోమీటర్ల పరిధి తర్వాత ఈ నిబంధనలేవీ వర్తించవని స్పష్టం చేసింది. ఆలయం సమీపంలో ఇప్పుడు పెద్దసంఖ్యలో హోటళ్లు, రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేఎఫ్‌సీ కూడా ఔట్‌లెట్ తెరబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం స్పందించి ఈ ప్రకటన చేసింది.