Site icon HashtagU Telugu

IRCTC : ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అంతే సంగతులు.. హెచ్చరించిన ఇండియన్ రైల్వే..

IRCTC Website

IRCTC Website

ఇటీవల సైబర్ క్రైమ్(Cyber Crime) మోసాలు బాగా ఎక్కువవుతున్నాయి. సోషల్ మీడియా(Social Media) యాప్స్ లో ఏవో ఒక లింక్స్ పంపించి వాటిని క్లిక్ చేస్తే మన సమాచారం, డబ్బులు దోచుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే అధికారిక యాప్స్ కి డూప్లికేట్ తయారు చేసి వాటిని డౌన్లోడ్ చేసుకోమని లింక్స్ ని పంపిస్తున్నారు. తాజాగా కొన్ని రోజుల నుంచి ఇండియన్ రైల్వేకి(Indian Railway) చెందిన IRCTC కి డూప్లికేట్ యాప్ సర్క్యులేట్ అవుతుంది.

ఈ విషయం IRCTC దృష్టికి రావడంతో ఇండియన్ రైల్వే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇండియన్ రైల్వే అధికారులు తాజాగా మీడియాతో మాట్లాడుతూ… irctcconnect.apk అనే పేరుతో ఓ యాండ్రాయిడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోమని వాట్సాప్, టెలిగ్రామ్ మరికొన్ని సోషల్ మీడియాలలో వైరల్ అవుతుంది. దయచేసి దాన్ని ఎవరూ డౌన్లోడ్ చేసుకోవద్దు. కొంతమంది సైబర్ మోసగాళ్లు ఇలా ప్రమోట్ చేస్తున్నారు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ ఫోన్లోని విలువైన సమాచారం మొత్తం దొంగిలిస్తారు. కాబట్టి ఎవరూ ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవద్దని తెలిపారు.

అలాగే ఎవరైనా టికెట్ బుకింగ్ కోసం IRCTC యాప్ ని వాడాలనుకుంటే.. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్ కి వెళ్లి IRCTC రైల్ కనెక్ట్ అనే అధికార యాప్ ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. కాబట్టి ఎవరైనా అలాంటి IRCTC డూప్లికేట్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని లింక్స్ వస్తే చేసుకోకండి

 

Also Read :    Zomato: జొమాటో కు షాకిచ్చిన ఉద్యోగులు.. దెబ్బకు లైన్ లోకి వచ్చిన సంస్థ?

Exit mobile version