Site icon HashtagU Telugu

J&K : జ‌మ్ము క‌శ్మీర్‌లో 20 మంది ఐపీఎస్ అధికారులు బ‌దిలీ

Ips Imresizer

Ips Imresizer

జ‌మ్ము క‌శ్మీర్‌లో భారీగా ఐపీఎస్ అధికారుల బ‌దిలీ జ‌రిగింది. 20 మంది ఐపిఎస్ అధికారులతో సహా 74 మంది పోలీసు అధికారులను బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఏడు జిల్లాలకు కొత్త పోలీసు చీఫ్‌, మూడు రేంజ్‌ల డీఐజీల నియామకం జరిగింది. శుక్రవారం సాయంత్రం హోం శాఖ జారీ చేసిన రెండు వేర్వేరు ఉత్తర్వుల ప్రకారం, 15 మంది డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌లు (డీఐజీలు), 59 మంది పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీలు) బ‌దిలీ అయ్యారు. 1997 బ్యాచ్‌కు చెందిన సీనియర్ IPS అధికారి గరీబ్ దాస్ ఉధంపూర్‌లోని షెరీ కాశ్మీర్ పోలీస్ అకాడమీ (SKPA) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. సౌత్ కశ్మీర్ రేంజ్ ఐపీఎస్ అధికారి రయీస్ మహ్మద్ భట్‌ను కొత్త డీఐజీగా నియమించగా, మరో ఐపీఎస్ వివేక్ గుప్తాను బదిలీ చేసి ఉత్తర కశ్మీర్ రేంజ్ డీఐజీగా, శక్తి పాఠక్‌ను జమ్మూ-సాంబా-కతువా రేంజ్ కొత్త డీఐజీగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA) కూడా IPS అధికారులు డాక్టర్ అజీత్ సింగ్, అబ్దుల్ ఖయూమ్, హసీబ్-ఉర్-రెహ్మాన్‌లను SIA డీఐజీలుగా నియమించారు. ఐపీఎస్ అధికారి శ్రీధర్ పాటిల్ జమ్మూ ట్రాఫిక్ డీఐజీగా బదిలీ అయ్యారు. బదిలీ అయిన 59 మంది ఎస్పీలలో నాగ్‌పురే అమోద్ అశోక్ (ఐపీఎస్) సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పీ) బారాముల్లాగా, ఆ తర్వాత లక్షయ్ శర్మ (ఐపీఎస్), సాహిల్ సరంగల్ (ఐపీఎస్) బందిపోరా, కుల్గాం జిల్లాల ఎస్పీలుగా పోస్టింగ్ చేయబడ్డారు. అదేవిధంగా, కతువా జిల్లా ఎస్పీగా దీప్ సింగ్ జమ్వాల్, సాంబా జిల్లా ఎస్ఎస్పీగా బెనమ్ తోష్, కిష్త్వార్, బద్గామ్ జిల్లాలకు కొత్త ఎస్పీలుగా ఖలీల్ అహ్మద్ పోస్వాల్, అల్-తాహిర్ గిలానీలు నియమితులైనట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ క్రమంలో వివిధ జిల్లాల్లో కొత్తగా పది మంది అదనపు ఎస్పీలను నియమించారు.