Site icon HashtagU Telugu

IPL Team – Congress Manifesto : ఆ పార్టీ మేనిఫెస్టోలో ‘ఐపీఎల్ టీమ్’ హామీ.. !

Ipl Team Congress Manifesto

Ipl Team Congress Manifesto

IPL Team – Congress Manifesto : మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఓ ఆసక్తికరమైన హామీ ఉంది. అదేమిటో తెలుసా? ‘‘ఐపీఎల్ టీమ్’’. ఔను .. తాము అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్ ఐపీఎల్ టీమ్ ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది. ఈ అంశంపై ఇప్పుడు నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది.ఐపీఎల్ టీమ్ ప్రజలకు అవసరమా ? కాదా ? అనే కోణంలో డిబేట్ నడుస్తోంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కమల్ నాథ్ ఇవాళ ఉదయమే విడుదల చేశారు.

106 పేజీల మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో బుక్ లో మొత్తం 59 హామీలు ఉన్నాయి. బీసీలకు 27 శాతం రిజర్వేషన్, పౌరులందరికీ రూ. 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని కూడా హస్తం పార్టీ అంటోంది. ఎల్పీజీ సిలిండర్ ను 500 రూపాయలకే అందిస్తామని చెబుతోంది.  నిరుద్యోగులకు రెండేళ్లపాటు రూ. 15,00 నుంచి 3000 వరకు ఆర్థిక సాయం  అనే హామీ అత్యంత కీలకమైంది. ఇక పాఠశాల విద్య ఉచితం, ప్రతి నెలా మహిళలకు 1,500, పాత పెన్షన్ విధానం అమలు అనేవి కూడా ప్రధానంగా ఉన్నాయి. రైతుల విషయానికి వస్తే..  రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. పంటలకు  మద్దతు ధరలు లభించేలా చూస్తామని (IPL Team – Congress Manifesto) చెబుతోంది.