Site icon HashtagU Telugu

iPhone 16 Sale: ముంబైలో జోరుగా ఐఫోన్-16 విక్రయాలు

iPhone 16 Sale

iPhone 16 Sale

iPhone 16 Sale: శుక్రవారం నుండి దేశంలో ఐఫోన్ -16 (iPhone16) సిరీస్‌ను విక్రయించడం ప్రారంభించింది. ముంబైలోని బాంద్రాలోని బీకేసీ (BKC) ఆపిల్ స్టోర్ వద్ద కొనుగోలుదారులు బారులు తీరారు. ఉదయం దుకాణం తెరవకముందే వేల సంఖ్యలో ప్రజలు క్యూలో నిలబడి ఉన్నారు. దుకాణం తెరిచిన వెంటనే ఫోన్ల కొనుగోలు ప్రారంభమైంది. అహ్మదాబాద్‌, గుజరాత్‌, సూరత్‌, మధ్యప్రదేశ్‌, నాగ్‌పూర్‌, ఇండోర్‌, బెంగళూరు, గోవా, నాసిక్‌, నాందేడ్‌ నుంచి ప్రజలు ఫోన్‌ కొనుగోలు చేసేందుకు రాత్రి నుంచే క్యూలో నిల్చున్నారు.

గుజరాత్ నుంచి వచ్చిన ఆషికా కపారియా మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులందరికీ ఐఫోన్-16 ప్రో, ఐఫోన్-16 ప్రో మ్యాక్స్ కొనుగోలు చేసేందుకు వచ్చానని తెలిపారు. రెండేళ్ల క్రితం యాపిల్ స్టోర్ ఇండియాకు వచ్చింది. గతంలో ఐఫోన్ కొనేందుకు దుబాయ్ వెళ్లేవాళ్లం. ఆపిల్ ఈసారి చాలా ఫీచర్లను మార్చింది. ఎవరైనా రూ.10 లక్షల విలువైన మొబైల్ ఇచ్చినా తీసుకోము. రూ.10 లక్షలైనా, రూ.2 లక్షలైనా యాపిల్ మాత్రమే కొనుగోలు చేస్తాం. మా కుటుంబం కోసం ప్రతి సంవత్సరం కొత్త ఫోన్ కొనుగోలు చేస్తాము. యాపిల్ ఫోన్ లాంచ్ అయిన వెంటనే, సేల్ ప్రారంభమైన మొదటి రోజే కొనుగోలు చేస్తామని తెలిపారు.

సూరత్ నుండి వచ్చిన ముఖ్తార్ మాట్లాడుతూ.. ఐఫోన్ 16 ప్రో కొనడానికి వచ్చామని చెప్పాడు. విక్రయించిన మొదటి రోజు కొనుగోలు చేస్తాము. ఐఫోన్ సిరీస్ లోని అన్ని రంగులు అందంగా ఉంటాయి. మా కొడుకు, కూతురి ఇష్టం మేరకు దీన్ని కొనేందుకు సూరత్ నుంచి ముంబైకి వచ్చామని తెలిపారు. ఐఫోన్ 16 సిరీస్ కొనేందుకు ఇక్కడికి వచ్చామని సూరత్ నుంచి వచ్చిన మహ్మద్ పేటీవాలా తెలిపారు. మేం 250 కిలోమీటర్ల దూరం నుంచి యాపిల్ ఫోన్లు కొనేందుకు వచ్చాం. ఆపిల్ నిర్మించిన బికెసి స్టోర్ చాలా అందంగా ఉంది. సిబ్బంది అందరూ మంచివారు. డెమో తదితర ఏర్పాట్లు కూడా బాగానే జరిగాయి. ఇక్కడికి వచ్చిన నా అనుభవం చాలా బాగుందన్నారు. ఇలా ఎవరికీ వాళ్ళు తమ అనుభూతులు, అభిప్రాయాలను పంచుకున్నారు.

Also Read: Laddu Prasadam : తిరుమలలో లడ్డు ప్రసాదం ఎప్పుడు మొదలుపెట్టారో తెలుసా..?