త్వ‌ర‌లో అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల పున‌రుద్ధ‌ర‌ణ‌

అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌న్నింటినీ పున‌రుద్ధ‌రించ‌డానికి భార‌త ప్ర‌భుత్వం సిద్ధం అవుతోంది.

  • Written By:
  • Publish Date - November 24, 2021 / 05:18 PM IST

అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌న్నింటినీ పున‌రుద్ధ‌రించ‌డానికి భార‌త ప్ర‌భుత్వం సిద్ధం అవుతోంది. ఈ ఏడాది చివ‌రి నుంచి అన్ని దేశాల‌కు వాణిజ్య విమానాల‌ను న‌డ‌ప‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఎయిర్ ఇండియా పూర్తి స్థాయిలో సేవ‌ల‌ను అందించ‌నుంది. ఈ ఏడాది అక్టోబ‌ర్ లో టాటా స‌న్స్ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన విష‌యం విదిత‌మే. టాటా స‌న్స్ ఆధ్వ‌ర్యంలో ఎయిర్ ఇండియా వినూత్న సేవ‌ల‌ను అందించ‌డానికి క‌స‌ర‌త్తు చేస్తోంది. విమాన స‌ర్వీసులు ఉండే భార‌త విమాన‌యాన మంత్రిత్వ‌శాఖ చ‌ర్య‌లు తీసుకుటోంది.కరోనావైరస్ కారణంగా గత ఏడాది మార్చి నుండి దేశంలో వాణిజ్య అంతర్జాతీయ విమానాల‌ను ర‌ద్దు చేశారు. నవంబర్ 30 వరకు విమానాల ర‌ద్దును పొడిగించారు. కార్గో విమానాలు ,ఎయిర్ బబుల్ ఏర్పాట్ల పరిధిలోకి వచ్చే వాణిజ్య విమానాలకు మాత్రం మినహాయింపు ఉంది.

Also Read : Oxfam India : ఇండియ‌న్ ఆస్ప‌త్రుల్లో ముస్లిం మ‌త వివ‌క్ష‌

ఆఫ్ఘనిస్తాన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాక్, జపాన్, మాల్దీవులు, యూఏఈ, యూకే, అమెరికా తదితర 31 దేశాలతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందం భార‌త్ కుదుర్చుకుంది. ఆ విష‌యాన్ని పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్ తెలిపారు. ఇవే కాకుండా అన్ని ర‌కాల సేవ‌ల‌ను “ఈ సంవత్సరం చివరి నాటికి” సాధారణీకరించబడతాయని భావిస్తున్నారు. డిసెంబర్ చివరి నాటికి ఎయిర్ ఇండియా యొక్క అన్ని కార్యకలాపాలను అప్పగించడానికి మంత్రిత్వ శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గత వారం కూడా ప‌రిస్థితిని స‌మీక్షించారు. అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను సాధారణీకరించే ప్రక్రియను అంచ‌నా వేశాడు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో క‌రోనా ఇంకా కొన‌సాగుతోంది. క‌రోనా సాధారణ స్థితికి వ‌చ్చే అంశాల‌ను బేరీజు వేసుకుని అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను పూర్తి స్థాయిలో పున‌రుద్ద‌రించ‌డానికి సింధియా అండ్ టీం సిద్ధం అవుతోంది.