Drugs : ఉత్తరప్రదేశ్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు.. న‌లుగురు అరెస్ట్‌

ఉత్తరప్రదేశ్ పోలీసులు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను రాకెట్‌ను ఛేదించారు. ముఠా నాయకుడితో సహా నలుగురిని

  • Written By:
  • Publish Date - September 16, 2023 / 10:13 AM IST

ఉత్తరప్రదేశ్ పోలీసులు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను రాకెట్‌ను ఛేదించారు. ముఠా నాయకుడితో సహా నలుగురిని అరెస్టు చేశారు. డ్రగ్ డీలర్ నూర్ అహ్మద్, ముగ్గురు సహచరులను మధుర జిల్లా నుండి యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై పోలీసులు అరెస్ట్ చేశారు. నూర్ అహ్మద్, నూర్ ఆలం, అబిద్, నరేంద్ర కుమార్ లు నేపాల్ నుంచి హషీష్ ఆయిల్‌ను భారత్‌కు తరలించేందుకు ముఠాగా ఏర్పడ్డారని, ఆ ముఠాకు నూర్ అహ్మద్ లీడర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. నూర్ అహ్మద్ దుబాయ్‌లో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, అక్కడ నరేంద్ర కుమార్‌తో స్నేహం కుదుర్చుకున్నాడని విచారణలో తేలింది. 2021లో భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత అబిద్ అనే యువకుడిని డ్రగ్స్ వ్యాపారంలో పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ముఘా నేపాల్ నుండి కిలోకు రూ. 1 లక్ష చొప్పున హషీష్‌ను కొనుగోలు చేశారు . ఇండియాలో దానిని 10-15 రెట్లు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నార‌ని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి సుమారు 50 కిలోల హషీష్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరినీ జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.