Avtar-Saini: ఇంటెల్ ఇండియా మాజీ ఛీప్‌ అవ‌తార్ సైనీ మృతి

  Former-Intel-India-Head-Avtar-Sain: ఇంటెల్ ఇండియా మాజీ హెడ్ అవ‌తార్ సైనీ(Avtar Sain) రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించార‌ని పోలీసులు గురువారం వెల్ల‌డించారు. న‌వీ ముంబై టౌన్‌షిప్‌లోని పామ్ బీచ్ రోడ్‌లో సైనీ (68) సైక్లింగ్ చేస్తుండ‌గా వెనుక నుంచి దూసుకొచ్చిన క్యాబ్ ఆయ‌న సైకిల్‌ను ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన సైనీని స‌హ‌చ‌ర సైక్లిస్ట్‌లు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మ‌ర‌ణించార‌ని వైద్యులు నిర్ధారించారు. ఇంటెల్ 386, 486 మైక్రోచిప్‌ల‌పై సైనీ చేసిన క‌స‌ర‌త్తుకు ప్ర‌శంస‌లు ల‌భించాయి. కంపెనీ పెంటియ‌మ్ […]

Published By: HashtagU Telugu Desk
Intel India Ex Chief Dies A

Intel India Ex Chief Dies A

 

Former-Intel-India-Head-Avtar-Sain: ఇంటెల్ ఇండియా మాజీ హెడ్ అవ‌తార్ సైనీ(Avtar Sain) రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించార‌ని పోలీసులు గురువారం వెల్ల‌డించారు. న‌వీ ముంబై టౌన్‌షిప్‌లోని పామ్ బీచ్ రోడ్‌లో సైనీ (68) సైక్లింగ్ చేస్తుండ‌గా వెనుక నుంచి దూసుకొచ్చిన క్యాబ్ ఆయ‌న సైకిల్‌ను ఢీ కొట్టింది.

తీవ్ర గాయాలైన సైనీని స‌హ‌చ‌ర సైక్లిస్ట్‌లు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మ‌ర‌ణించార‌ని వైద్యులు నిర్ధారించారు. ఇంటెల్ 386, 486 మైక్రోచిప్‌ల‌పై సైనీ చేసిన క‌స‌ర‌త్తుకు ప్ర‌శంస‌లు ల‌భించాయి. కంపెనీ పెంటియ‌మ్ ప్రాసెస‌ర్ డిజైన్‌కు కూడా ఆయ‌న నేతృత్వం వ‌హించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఘ‌ట‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన పోలీసులు త‌దుప‌రి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. సైనీ సైకిల్‌ను ఢీకొట్టిన అనంత‌రం క్యాబ్ డ్రైవ‌ర్ ఘ‌ట‌నా స్ధ‌లం నుంచి ప‌రార‌య్యారు. నిందితుడి కోసం ముంబై పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇంటెల్ ఇండియా మాజీ హెడ్ సైనీ మృతి ప‌ట్ల ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేశారు.

read also : Jaleel Khan : పార్టీ మారను.. టీడీపీలోనే ఉంటా

  Last Updated: 29 Feb 2024, 05:06 PM IST