Infosys Power : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఏటా ఎంతో మంది ఇంజినీరింగ్ ఫ్రెషర్లకు జాబ్స్ ఇస్తుంటుంది. అయితే వారికి వార్షిక ప్రారంభ వేతనం రూ.3.60 లక్షల రేంజులోనే ఉంటుంది. ఫ్రెషర్ల నియామకం కోసం సరికొత్త ప్రోగ్రామ్‌ను ఇన్ఫోసిస్ డిజైన్ చేసింది. దానిపేరే ‘ఇన్ఫోసిస్ పవర్’(Infosys Power). దీని కిింద జాబ్‌కు ఎంపికయ్యే ఫ్రెషర్లు బంపర్ ఆఫర్ కొట్టినట్టే. ఎందుకంటే వారికి గరిష్ఠంగా రూ.9 లక్షల దాకా వార్షిక వేతన ప్యాకేజీని అందిస్తారు.
We’re now on WhatsApp. Click to Join
సాఫ్ట్‌వేర్ కోడింగ్, దానిలోని సవాళ్లు, ప్రోగ్రామింగ్‌పై మంచి పట్టు ఉన్న ఫ్రెషర్లను ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రాం ద్వారా ఎంపిక చేస్తారు. ఈక్రమంలో అభ్యర్థులకు ఆయా రంగాలపై ఎంతమేర పట్టు ఉందనే విషయాన్ని టెస్ట్ చేస్తారు. వివిధ పరీక్షలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. అవన్నీ నెగ్గిన వారినే చివరిగా ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రాం ద్వారా జాబ్‌లోకి తీసుకుంటారు. తొలుత వార్షిక వేతనం రూ.4 లక్షలకుపైనే ఉంటుందని.. దాన్ని క్రమంగా పెంచుతూ రూ.9లక్షలకు చేరుస్తారు.
Also Read :KTR Vs CM Revanth : కేటీఆర్ వర్సెస్ సీఎం రేవంత్.. రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై సంచలన వ్యాఖ్యలు
గత సంవత్సరం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కూడా ‘ప్రైమ్’ పేరిట ఇదే విధంగా ట్యాలెంటెడ్ ఫ్రెషర్లను నియమించుకుంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో నిపుణులైన ఫ్రెషర్లకు దాదాపు రూ.9 లక్షలకుపైనే ప్రారంభ వార్షిక వేతనాన్ని అందించింది. అయితే ఈ సంవత్సరంలో ఏఐ, జనరేటివ్ ఏఐ, మెషీన్ లెర్నింగ్ విభాగాల్లో మంచి స్కిల్స్ ఉన్న ఫ్రెషర్లకు ఇంత ఫ్యాకేజీని టీసీఎస్ అందిస్తోంది. ప్రస్తుతం టీసీఎస్.. నింజా, డిజిటల్, ప్రైమ్ అనే మూడు కేటగిరీల కింద ఫ్రెషర్లను భర్తీ చేస్తోంది. నింజా కేటగిరిలో జాబ్ సాధించే ఫ్రెషర్లకు వార్షిక వేతనం రూ.3.6 లక్షలు, డిజిటల్ కేటగిరిలో జాబ్ వచ్చే వారికి రూ.7.5 లక్షల వార్షిక వేతనం, ప్రైమ్ కేటగిరిలో జాబ్ వచ్చే ఫ్రెషర్లకు రూ.9 లక్షల ప్యాకేజీని ఇస్తున్నారు. ఇప్పుడు ఐటీ కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో నైపుణ్యాలు కలిగిన వారి కోసం వెతుకుతున్నాయి.