Site icon HashtagU Telugu

Cleanliness Survey : మోస్ట్ క్లీన్ సిటీగా ఆరోసారి రికార్డుల్లోకి ఇండోర్…తర్వాత స్థానంలో…??

Cleanest City

Cleanest City

దేశంలోమోస్ట్ క్లిన్ సిటీగా వరుసగా ఆరోసారి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరం అగ్రస్థానంలో నిలిచింది. సూరత్, ముంబై రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్చ సర్వేక్షణ్ సర్వే వివరాలను శనివారం రిలీజ్ చేసింది. స్వచ్చ్ సర్వేక్షణ్ పురస్కార్ 2022లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల విభాగంలో మధ్య ప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్రలు ఉన్నాయి.

కాగా ఈ సర్వేలో భాగంగా 2016లో కేవలం 73 నగరాల్లో మాత్రమే సర్వే నిర్వహించారు. ఈ సారి 4354 నగరాల్లో సర్వే నిర్వహించారు. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు బహుమతులను అందజేశారు. ఇక సరిహాద్దు పట్టణాల కేటగిరిలో పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ మోస్ట్ క్లీన్ సిటీగా మొదటిస్థానంలో నిలిచింది. అబోహర్ రెండో స్థానంలో ఉంది. 1 నుంచి 10లక్షల జనాభా ఉన్న నగరాల విభాగంలో ఈ రెండు నగరాలు మాత్రమే పోటీ పడ్డాయి.

గతేడాది స్వచ్చ్ సర్వేక్షణ్ అవార్డ్స్ లో మూడో స్ధానంలో విజయవాడ నిలిచింది. కానీ ఇప్పుడు దానిని కోల్పోయింది. ఆ స్ధానాన్ని నవీ ముంబాయి దక్కించుకుంది.