1st Flight To Ayodhya : ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది జరిగిన కొద్దిసేపటికే .. అయోధ్యలోని కొత్త విమానాశ్రయానికి వెళ్లే మొదటి ఇండిగో విమానం శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరింది. ఇండిగో పైలట్ అశుతోష్ శేఖర్ విమానంలో ఉన్న ప్రయాణికులందరికీ ఈసందర్భంగా స్వాగతం పలికారు. ఆయన ఏమన్నారంటే.. “ఇండిగో నాకు ఇంతటి ప్రాముఖ్యత కలిగిన విమానానికి నాయకత్వం వహించే అవకాశాన్ని కల్పించినందుకు గొప్ప అదృష్టవంతుడిని.. మీ ప్రయాణం చక్కగా, సంతోషంగా జరుగుతుందని మేం ఆశిస్తున్నాం. మేం మీకు మరిన్ని అప్‌డేట్‌లను అందిస్తూ ఉంటాం. జై శ్రీరామ్” అని పైలట్ అశుతోష్ శేఖర్ చెప్పారు. ఆ వెంటనే విమానంలో ఉన్న ప్రయాణికులు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు.దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(1st Flight To Ayodhya) అవుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
అయోధ్య విమానాశ్రయం విశేషాలు
- జనవరి 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈక్రమంలోనే ఇవాళ అయోధ్య రైల్వే స్టేషన్‌లోని నూతన భవనం, అయోధ్య ఎయిర్‌పోర్టులను ప్రధాని మోడీ ప్రారంభించారు.
- రామమందిరం ప్రారంభమయ్యాక అయోధ్యకు భక్తుల తాకిడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
- అయోధ్య విమానాశ్రయాన్ని దాదాపు రూ. 1,450 కోట్లతో నిర్మించారు.
- ఈ విమానాశ్రయంలోని టెర్మినల్ భవనం 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఏటా 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలను అందించేందుకు వీలుగా దీన్ని సకల సౌకర్యాలతో తీర్చిదిద్దారు.
- ఈ ఎయిర్ పోర్టు భవనం యొక్క ముఖభాగం అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని తలపించేలా ఉంటుంది.
- విమానాశ్రయ టెర్మినల్ లోపలి భాగంలో గోడలపై రాముడి జీవితాన్ని వర్ణించే స్థానిక కళ, పెయింటింగ్‌లు, కుడ్యచిత్రాలు ఉంటాయి.
- అయోధ్య విమానాశ్రయం టెర్మినల్ భవనంలో ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, LED లైటింగ్, రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్, ఫౌంటైన్‌లతో ల్యాండ్‌స్కేపింగ్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి కర్మాగారం, సోలార్ పవర్ ప్లాంట్, అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి.
- ఈ విమానాశ్రయంలో 2,200 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పు గల రన్‌వే ఉంది.
- ఇక్కడ మొదటి దశలో ఎయిర్‌బస్ A320, ATR-72, బొంబార్డియర్ ప్రైవేట్ జెట్‌ల ల్యాండింగ్, టేకాఫ్‌లను నిర్వహిస్తారు.
- రెండో దశలో రన్‌వేను 3,200 మీటర్ల మేరకు విస్తరించి.. అప్పటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా ప్రారంభిస్తారు.
Also Read: Wall Paint With Sandals : చెప్పులు, చీపుర్లతో వాల్ పెయింటింగ్.. ఇదిగో వీడియో
#WATCH | IndiGo pilot captain Ashutosh Shekhar welcomes passengers as the first flight takes off from Delhi for the newly constructed Maharishi Valmiki International Airport, Ayodhya Dham, in Ayodhya, UP. pic.twitter.com/rWkLSUcPVF
— ANI (@ANI) December 30, 2023