గోవాలో ఇండిగో విమానానికి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. 180 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి ఇండిగో ఫ్లైట్ గోవా వెళ్లింది. ల్యాండింగ్ సమయంలో రన్‌వే పైకి మరో విమానం దూసుకొచ్చింది. దీంతో ఇండిగో విమానం ల్యాండ్ అయిన 15 సెకన్లలోనే మళ్లీ టేకాఫ్ అయింది. గాల్లోనే 20 నిమిషాలపాటు చక్కర్లు కొట్టింది. చివరకు ఏటీసీ నుంచి క్లియరెన్స్ రావడంతో సేఫ్‌గా ల్యాండ్ అయింది.
ఇకపోతే.. గత నెలలో ఇండిగో విమానంలో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. టేకాఫ్కు ముందు ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.వెంటనే ప్రయాణీకులను, సిబ్బందిని విమానం నుంచి కిందకు దింపారు. వారందరినీ సురక్షతంగా టెర్మినల్ భవానానికి తరలించామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపిన విషయం తెలిసిందే.