India Vs China : భూ సరిహద్దుల వెంట నిత్యం ఏదో ఒక సమస్యను సృష్టిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ రెడీ అయింది..
ఇందుకోసం సరికొత్త వ్యూహాన్ని అమల్లోకి తెచ్చింది.
సముద్ర సరిహద్దుల నుంచి చైనాకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగింది..
ఇందులో భాగంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన నౌకాదళ యాక్టివిటీని పెంచింది.
విమాన వాహక నౌకలు INS విక్రమాదిత్య, INS విక్రాంత్ లతో అరేబియా సముద్ర జలాల్లో భారత నౌకాదళం సైనిక అభ్యాసాలు చేసింది.. ఈ రెండు విమాన వాహక నౌకలపై 35 యుద్ధ విమానాలతో పాటు పలు హెలికాఫ్టర్లు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు కూడా ఉన్నాయి.. అరేబియా సముద్రంలో ఓ వైపు పాక్ కు సహకారం అందిస్తూ..మరోవైపు స్వయంగా మోహరింపులు పెంచుతున్న చైనాకు వార్నింగ్ ఇచ్చేందుకే(India Vs China) ఇండియా ఈ సైనిక అభ్యాసాలు చేసిందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. తద్వారా మలక్కా జలసంధి నుంచి పర్షియన్ గల్ఫ్ వరకు వ్యూహాత్మక ఆసక్తి ఉన్న దాని ప్రాంతంలో సముద్ర సరిహద్దుల నియంత్రణపై రాజీపడేది లేదనే సంకేతాలను చైనాకు పంపింది.
Also read : China Urine Business : ఇండియాకు మూత్రం సప్లై లో చైనా టాప్.. ఆత్మ నిర్భర్ దిశగా ఇండియా
INS విక్రమాదిత్య, INS విక్రాంత్ లు ఒక్కొక్కటి రోజుకు 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. ఇవి ఒక్కొక్కటి 40,000 టన్నుల బరువును మోయగలవు. “ఈ నౌకాదళ పరాక్రమ ప్రదర్శన జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడం, ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడుకోవడంతో పాటు సముద్ర ప్రాంతంలో సహకార భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో భారతదేశపు నిబద్ధతను నొక్కి చెబుతుంది” అని నేవీ ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వల్ వెల్లడించారు. మరోవైపు చైనా ఇప్పటికే హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఏడెనిమిది నౌకలు, గూఢచారి నౌకలను మోహరించింది. అరేబియా సముద్రంలో భారత్‌ను సవాలు చేసేలా బలమైన నౌకా దళాన్ని నిర్మించుకోవడంలో పాకిస్థాన్‌కు సహాయం చేస్తోంది. చైనా దగ్గర కూడా లియానింగ్మ, షాన్‌డాంగ్ అనే రెండు విమాన వాహక నౌకలు ఉన్నాయి. 80,000 టన్నుల కంటే ఎక్కువ బరువున్న ఫుజియాన్ అనే విమాన వాహక నౌకను ప్రస్తుతం చైనా నిర్మిస్తోంది.