వంటమనిషే అంటే ఇప్పటికి చాలామంది చిన్నచూపు చూస్తారు..కానీ అదే వంట తో ఏకంగా రూ.750 కోట్లు (Rs 750 Cr) సంపాదించి అందరికి ఆదర్శం అయ్యారు ఓ వంటమనిషి (India’s Richest Chef). ఈ మధ్య చాలామంది ఫుడ్ బిజినెస్ లోకి వెళ్తున్నారు..ఫుడ్ ద్వారా లక్షల్లో సంపాదించవచ్చని..మంచి ఫుడ్ అందించాలనే తపనతో చాలామంది ఫుడ్ రంగంలోకి దిగుతున్నారు. ఇదే క్రమంలో వంట చేసేవారికి రోజు రోజుకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. రోడ్ పక్కన న్యూడిల్స్ , ఫాస్ట్ ఫుడ్ చేసేవారు సైతం రోజుకు రూ. 1000 నుండి 2000 ల వరకు సంపాదిస్తున్నారు. ఇది కేవలం రోడ్డు పక్కన ఉండే షాపులలో మాత్రమే..అదే రెస్టారెంట్స్ లలో వంట చేసే చెఫ్ లు ఏకంగా ప్రతి రోజు వేలల్లో జీతం తీసుకుంటున్నారు.
తాజాగా వంటతో రూ.750 కోట్లు వెనకేసుకున్నట్లు తెలిపి వార్తల్లో నిలిచారు సంజీవ్ కపూర్. కృషి పట్టుదలతో వంటనే వృత్తిగా మలుచుకున్న సంజీవ్ ..ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శమయ్యారు. పంజాబ్, అంబాలాలో 1964 ఏప్రిల్ 10 జన్మించిన సంజీవ్ .. న్యూ ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాటరింగ్ అండ్ న్యూట్రిషన్ నుండి హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా పట్టా పొందారు. కాలేజీ నుండి బయటకు వచ్చిన అనంతరం 1984లో తన వృత్తిని ప్రారంభించి వివిధ టీవీ ఛానెల్స్ వంటల కార్యక్రమాలు చేస్తూ ఈనాడు కోట్లాది రూపాయులను వెనకేసుకున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
1992లో ప్రారంభమైన ఓ టీవీ షోని ఏకధాటిగా 18 ఏళ్ళు నడిపించిన ఘనత ఆయన సొంతం. ఆయన వంటలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. పంజీవ్ సోషల్ హ్యండిల్స్‌కు లక్షల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. 120 దేశాలలో ప్రసారమైన ఆయన వంటల షోకు ఇంటర్నెట్ అంతా ప్రాచుర్యంలో లేకపోయిన కూడా 500 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం విశేషం. దీంతో తనకున్న ఫాలోయింగ్‌ను గ్రహించి జనవరి 2011లో ఫుడ్ అండ్ లైఫ్ స్టయిల్ ఛానెల్‌ని ప్రారంభించిన తొలి చెఫ్‌గా సంజీవ్ నిలిచారు. ఆయన హోస్ట్ చేసిన ఖానా ఖజానా ఇండియన్ టెలివిజన్ అకాడమీ (ITA) బెస్ట్ కుకరీ షో బహుమతిని పలుమార్లు అందుకుంది. ఆ తర్వాత వండర్‌చెఫ్ అనే కంపెనీని స్థాపించిన సంజీవ్ కపూర్.. గతేడాది ఆ సంస్థ ఆదాయాన్ని రూ.700 కోట్లకు తీసుకెళ్లారు. వండర్‌చెఫ్‌ను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలనే ప్లాన్‌లో భాగంగా 100 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టాలని సంజీవ్ యోచిస్తున్నారు. వీటిలో 40 శాతం విదేశీ పెట్టుబడులు ఉన్నాయి. ఇప్పటికే సంజీవ్ కపూర్ ఇండియాతోపాటు, పలు దేశాల్లో రెస్టారెంట్స్‌ను నిర్వహిస్తూ.. ప్రియులకు..వంట చేసే చెఫ్ లకు ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నారు.
Read Also : RC16 : రామ్ చరణ్ చిత్రానికి ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్…
