Site icon HashtagU Telugu

GST Records: జీఎస్టీలో భారత్ రికార్డు.. గుడ్ న్యూస్ అంటూ మోడీ ట్వీట్!

Pm Modi 9

Pm Modi 9

వస్తు, సేవల పన్ను-GST వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. ఏప్రిల్‌ నెలకు గానూ లక్షా 87వేల కోట్ల రూపాయలు వసూళ్లు (Collectons) అయ్యాయి. గతేడాది ఏప్రిల్‌లో లక్షా 68వేల కోట్ల రూపాయలతో పోలిస్తే…. వసూళ్లలో 12 శాతం మేర వృద్ధి నమోదైంది. GST విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో వసూళ్లు నమోదు కావడం (Record) ఇదే తొలిసారి. ఏప్రిల్‌ నెలకు గానూ లక్షా 87వేల కోట్ల రూపాయలు వసూళ్లు అవ్వగా….. అందులో CGST కింద 38 వేల440 కోట్లు… SGST కింద 47వేల 412 కోట్లు, 89 వేల158 కోట్ల రూపాయల మేర IGST వసూలు కాగా….. సెస్సు కింద 12వేల 25 కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

2022-23 మొత్తం ఆర్థిక సంవత్సరానికి గానూ 18.10 లక్షల కోట్లు వసూలయ్యాయని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 22 శాతం అధికమని కేంద్రం తెలిపింది. రికార్డు స్థాయిలో GST వసూళ్లు కావడం దేశ ఆర్థిక వ్యవస్థకు శుభవార్తగా ప్రధాన మంత్రి మోదీ (PM Modi) ట్వీట్‌ చేశారు. తక్కువ పన్ను రేట్లు ఉన్నప్పటికీ.. GST వసూళ్లు పెరగడం విజయానికి సంకేతమని పేర్కొన్నారు.

Also Read: DK Sivakumar: డీకే కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్!