Site icon HashtagU Telugu

Most Wanted Terrorist : మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మర్డర్.. ఎలా ? ఎక్కడ ?

Most Wanted Terrorist

Most Wanted Terrorist

Most Wanted Terrorist : భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఒకరి తర్వాత ఒకరుగా పాకిస్థాన్ లో అనుమానాస్పద స్థితిలో హతమవుతున్నారు. ఈక్రమంలోనే మరో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ పాక్ లో హత్యకు గురయ్యాడు. అతడి పేరే.. షాహిద్ లతీఫ్ !! 2016లో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉన్న భారత వైమానిక స్థావరంపై పాక్ కు చెందిన జైషే మహ్మద్ టెర్రరిస్టులు దాడి జరిపారు. ఈ ఎటాక్ లో ఏడుగురు భారత సైనికులు వీరమరణం పొందారు. పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక స్థావరంపై దాడికి ప్లానింగ్ చేసిన పాక్ ఉగ్రమూకల్లో  జైషే మహ్మద్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్ ఉన్నట్లు భారత్ గుర్తించింది. అతడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. యూఏపీఏ, ఎన్‌ఐఏ కేసులు నమోదు చేసింది.  పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో ఉంటున్న అతగాడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.

We’re now on WhatsApp. Click to Join

2016లో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో భారత వైమానిక స్థావరం పక్కనున్న అడవిలో దాక్కొని.. చీకటి పడ్డాక సైనిక దుస్తుల్లో వచ్చిన నలుగురు జైషే మహ్మద్ ఉగ్రమూకలు వైమానిక స్థావరంలోకి చొరబడేందుకు యత్నించారు. అయితే భారత భద్రతా సిబ్బంది వాళ్లను అడ్డుకొని, కాల్పులు జరిపారు. ఐదు గంటలపాటు ఈ కాల్పులు, ఎదురు కాల్పులు కొనసాగాయి. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్‌ఎస్‌జీ, స్వాట్ బృందాల జాయింట్ ఆపరేషన్ లో ఆ నలుగురు ఉగ్రమూకలు (Most Wanted Terrorist)  హతమయ్యారు.

Also read : Secret Meeting : అమెరికాలో ఇండియా, కెనడా సీక్రెట్ మీటింగ్.. ఆ వివాదం క్లోజ్ ?