Longest River Cruise: దేశంలోనే పొడవైన రివర్ క్రూయిజ్.. వచ్చే ఏడాది షురూ!!

దేశంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ సర్వీస్‌ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి అస్సాంలోని బోగీబీల్ మధ్య ఇది నడవనుంది.

  • Written By:
  • Publish Date - October 1, 2022 / 07:15 AM IST

దేశంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ సర్వీస్‌ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి అస్సాంలోని బోగీబీల్ మధ్య ఇది నడవనుంది.
ఈ క్రూయిజ్ గంగా నది, బ్రహ్మపుత్ర నది, ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ రూట్ (IBPR) మీదుగా 4,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించ నుంది.ఈవిషయాన్ని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. అస్సాంలోని బోగీబీల్‌లో బహుళ ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈవిషయాన్ని తెలిపారు. క్రూయిజ్ సేవల ప్రారంభంతో పర్యాటకం, కార్గో రవాణా రంగాల్లో వాణిజ్యం, జీవనోపాధిని ప్రోత్సహించడంతో పాటు రాష్ట్ర ప్రజలు అంతర్గత జలమార్గాలను ఉపయోగించుకునే అవకాశాలను తెరుస్తామని మంత్రి పేర్కొన్నారు.లోతట్టు జలమార్గాల ఆర్థిక , పర్యావరణపరమైన లాజిస్టిక్స్ అవెన్యూ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడమే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యొక్క దార్శనికత అని సోనోవాల్ తెలిపారు. 2 జాతీయ జలమార్గాలతో పాటు బ్రహ్మపుత్ర నదిని ఉపయోగించి అస్సాంలో అంతర్గత జల రవాణా భారీ సామర్థ్యాన్ని ఉపయోగించు కోవడానికి ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కీలకం కాబోతోందని వివరించారు.
ఇన్‌ల్యాండ్ నావిగేషన్, రివర్ క్రూయిజ్ టూరిజం, బ్రహ్మపుత్ర మీదుగా అనువైన టెర్మినల్స్ నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి మార్గాలను కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తోందని మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. ఈసందర్భంగా బోగీబీల్‌, గుయిజాన్‌లలో 2 ఫ్లోటింగ్‌ జెట్టీల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.  రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌లో భాగంగా బోగీబీల్ వంతెన సమీపంలో
ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వేస్ (ఎన్‌ఎఫ్‌ఆర్) అభివృద్ధి చేసిన బోగీబీల్ రివర్ ఫ్రంట్ ప్యాసింజర్ జెట్టీని మంత్రి ప్రారంభించారు.
రెండు తేలియాడే జెట్టీలు అత్యంత అధునాతనమైన, నవీకరించబడిన సాంకేతికతను ఉపయోగించి స్టేట్-ఫర్-టెర్మినల్స్‌గా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ను EPC కాంట్రాక్ట్ విధానంలో (ఇంజనీరింగ్, సేకరణ, నిర్మాణం) కోస్టల్ కన్సాలిడేటెడ్ స్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ అనే కంపెనీకి కేటాయించారు. రెండు జెట్టీలను రూ.8.25 కోట్లతో నిర్మించాలని అంచనా వేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.