Underwater Metro: జల గర్భం నుంచి దూసుకు వెళ్లే.. అండర్ వాటర్ ట్రైన్ రెడీ!!

నింగిపై నడిచే రైలును చూశాం.. నేలపై నడిచే రైలును చూశాం.. కానీ నీళ్లలో నుంచి నడిచే రైలును చూడాలంటే వచ్చే ఏడాది మనం కోల్ కతాకు వెళ్ళాలి.

  • Written By:
  • Publish Date - July 30, 2022 / 11:00 AM IST

నింగిపై నడిచే రైలును చూశాం.. నేలపై నడిచే రైలును చూశాం.. కానీ నీళ్లలో నుంచి నడిచే రైలును చూడాలంటే వచ్చే ఏడాది మనం కోల్ కతాకు వెళ్ళాలి.

మన దేశంలో తొలిసారి కోల్‌కతా మెట్రో ప్రాజెక్టులో భాగంగా అండర్‌వాటర్‌ మెట్రోను తీసుకొచ్చేందుకు పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. మిగితా 20 శాతం పనులు మరో నాలుగైదు నెలల్లో పూర్తి కానున్నాయి. 2023 లో కోల్‌కతా అండర్‌వాటర్‌ మెట్రో జర్నీ మొదలు కానుంది. ఈనేపథ్యంలో దాని గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..

ముఖ్య అంశాలు..

* 1984లో చేపట్టిన కోల్ కతా మెట్రో ప్రాజెక్టుకు విస్తరణగా.. అండర్‌ వాటర్‌ మెట్రోను నిర్మించారు.

* దాదాపు రూ.10,000 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 49 శాతం జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఏజెన్సీ నిధులు సమకూర్చింది.

* కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో దీన్ని నిర్మిస్తున్నారు.

* కోల్‌కతా అండర్ వాటర్ మెట్రో మొత్తం ప్రయాణ దూరం 16.6 కిలోమీటర్లు.

* ఇది అండర్‌ గ్రౌండ్‌లోనే 10.8 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

* హుగ్లీ నదిలోని 520 మీటర్ల అండర్‌వాటర్‌ టన్నెల్‌ను ఈ రైలు కేవలం నిమిషం సమయంలోపే దాటుతుంది.

* సెక్టార్‌-5 నుంచి హుగ్లీ నది గుండా హౌరా వరకు ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికోసం ప్రత్యేకంగా టన్నెల్‌ను నిర్మించారు.

* న్యూలైన్‌లో రోజుకు 9 లక్షల మంది అంటే నగర జనాభాలో 20 శాతం మంది ప్రయాణిస్తారు.